కేంద్రాన్ని ఇరుకున పెట్టిన కేరళా సర్కారు

మోదీ సర్కార్‌ను ఇరుకునపెడుతూ కేరళా వామపక్ష సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్‌పై కేవలం 1 పైసా తగ్గించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఏకంగా రూ.1 తగ్గించనున్నట్లు కేరళా సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

Janardhan V | news18
Updated: May 30, 2018, 12:46 PM IST
కేంద్రాన్ని ఇరుకున పెట్టిన కేరళా సర్కారు
కేరళ సీఎం పినరయి విజయన్(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: May 30, 2018, 12:46 PM IST
  • Share this:
Kerala Govt Cuts Fuel Prices by Re 1 as Centre Reduces it by 1 Paisa
Kerala Chief Minister Pinarayi Vijayan. (File photo)


పెట్రో ధరలు భగ్గుమంటున్న తరుణంలో మోదీ సర్కారును ఇరుకున పెడుతూ కేరళలోని వామపక్ష సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌ ధరలను గత 16 రోజులుగా పెంచుతూ వచ్చిన ఆయిల్ కంపెనీలు... వినియోగదారుడికి ఊరట కలిగిస్తూ లీటరు పెట్రోల్, డీజిల్‌‌పై 60 పైసలు తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే దీన్ని సవరిస్తూ లీటరు‌పై కేవలం 1 పైసా మాత్రమే తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. కేవలం 1 పైసా తగ్గించడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా కేంద్రాన్ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఈ తగ్గింపుపై సెటైర్స్ వేస్తూ పలు ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు సైతం మోదీ సర్కార్‌ తీరు పేద, మధ్యతరగతి ప్రజలను అవహేళన చేసేలా ఉందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతూ కేరళా ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.1 తగ్గిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్రం 1 పైసా తగ్గిస్తే తాము ఏకంగా రూ.1 తగ్గిస్తామంటూ ఛాలెంజ్ విసిరింది. తగ్గిన ధరలు ఇప్పటికిప్పుడే కాకుండా...జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పినరయి విజయన్ తెలిపారు.
పెట్రో ధరల పెంపుపై రాజకీయ రచ్చ కొనసాగుతున్న తరుణంలో పినరయి విజయన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా మోదీ సర్కార్‌ను ఇబ్బందిపెట్టేందుకే కేరళా సర్కారు ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం జరిగుతోంది. కారణం ఏదైనా.. రోజూ పెరుగుతున్న పెట్రో ధరలతో కుదేలవుతున్న వాహనదారులకు ఇది కాస్తైనా ఉపసమనం కలిగిస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

గత 16 రోజులుగా ప్రతి రోజూ పెట్రో ధరలు పెరుగుతూ రావడంతో...ఇది రికార్డు గరిష్ఠ స్థాయికి చేరాయి. గత 16 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.3.80 పెరగ్గా...డీజిల్‌పై రూ.3.38 పెరిగింది. కేరళలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.81.34గా ఉండగా...డీజిల్ రూ.73.99గా ఉంది.

గత రెండు వారాలుగా పెట్రో ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో...పెట్రో ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం కేరళా ప్రభుత్వమే కావడం విశేషం. దీంతో ఇతర రాష్ట్రాలు కూడా కేరళా బాటలోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల్సిన నిర్భందకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ ప్రత్యర్థులు పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ...పెట్రో ధరలను కేవలం 1 పైసా తగ్గించడం ప్రజలను ఫూల్ చేయడమేనంటూ మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.
Published by: Janardhan V
First published: May 30, 2018, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading