17 వస్తువుల కిట్ ఉచితం.. ఉప్పు, చక్కెర, టీ పొడి, సబ్బు, నూనె అన్నీ..

హోమ్ క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులు, వయో వృద్ధులుకు మాత్రం ఇళ్లకే ఉచిత రేషన్, ఉచిత ఆహార కిట్లను పంపిణీ చేస్తారు. ఐతే కిట్ల విషయంలో పోర్టబిలిటీ ఉండదని.. తాము రిజస్టరైన రేషన్ దుకాణాల్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు

news18-telugu
Updated: April 9, 2020, 8:16 PM IST
17 వస్తువుల కిట్ ఉచితం.. ఉప్పు, చక్కెర, టీ పొడి, సబ్బు, నూనె అన్నీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక, చేతిలో డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. ఐతే ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రేషన్‌తో పాటు డబ్బు కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఐతే కేరళ సర్కార్ మరో అడుగు ముందుకేసి.. ఒక ఇంటికి కావల్సిన అన్ని సరుకులను అందజేస్తోంది. 17 సరుకులతో కూడిన కిట్‌ను రేషన్ కార్డు కలిసిన ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తోంది. కేరళలో ఇవాళ్టి నుంచే వీటి పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో కిట్‌లో వెయ్యి రూపాయల విలువైన సరకులు ఉంటాయి. అందులో కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల టీ పౌడర్, అరలీటర్ వంటనూనె, రెండు కేజీల గోధుమ పిండి, కేజీ రవ్వ, మినుములు, శనగలు, సబ్బులు మొదలైన 17 వస్తువులు ఉంటాయి.

రేషన్ కార్డు కలిగిన ప్రజలు తమ రేషన్ షాపుల నుంచి వీటిని పొందవచ్చని కేరళ పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోంది. ఇక హోమ్ క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులు, వయో వృద్ధులుకు మాత్రం ఇళ్లకే ఉచిత రేషన్, ఉచిత ఆహార కిట్లను పంపిణీ చేస్తారు. ఐతే కిట్ల విషయంలో పోర్టబిలిటీ ఉండదని.. తాము రిజస్టరైన రేషన్ దుకాణాల్లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వ ఈ ఆహార కిట్ల కోసం రూ.350 కోట్లు కేటాయించింది. కాగా, కేరళలో ఇప్పటి వరకు 345 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో ఇద్దరు చనిపోయారు. మరో 83 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కావడంతో.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 260 యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: April 9, 2020, 8:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading