KERALA GOVERNOR ARIF MOHAMMAD KHAN PROTEST FAST AGAINST DOWRY IN TIRUVANATHAPURAM SK
Kerala Governor: రాజ్‌భవన్‌లో గవర్నర్ నిరాహార దీక్ష.. ఎందుకో తెలుసా..?
కేరళ గవర్నర్ నిరాహార దీక్ష
గత నెలలో ఓ మెడికల్ విద్యార్థిని తన భర్త వరకట్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మెడిసిన్ చదువున్న మహిళ వరకట్నానికి బలవడం.. అది కూడా కేరళలాంటి అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో జరగడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేయడం సర్వ సాధారణమే. అప్పుడప్పుడూ అధికారంలో ఉన్న పార్టీలు కూడా కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు. కానీ గవర్నర్ దీక్ష చేయడం చాలా అరుదు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాజ్‌భవన్‌లో నిరహార దీక్షకు దిగారు. తిరువనంతపరంలోని తన కార్యాలయంలో ఈ నిరసన దీక్షకు కూర్చున్నారు. గవర్నర్ ఏంటి? నిరహార దీక్ష చేయడమేంటని అనుకుంటున్నారా? కేరళలో పలు ప్రజా సంఘాలు వరకట్నానికి వ్యతిరేకంగా నిరహార దీక్ష చేపట్టారు. గాంధీ భవన్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాజ్‌భవన్‌లో దీక్షకు కూర్చున్నారు. వరకట్నం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆయన దీక్ష చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెళ్లాయి.
Kerala | Governor Arif Mohammed Khan has started his fast against dowry. The ‘fast against dowry’ is being organized by Gandhian organizations, says Governor's office
The Governor will join the protest at Gandhi Bhavan from 4.30 pm to 6 pm today: Governor's office pic.twitter.com/HrHVwuDxH6
వరకట్న వేధింపులతో మహిళలు మరణించినందుకు ఇటీవల కేరళ రాష్ట్రం వార్తల్లో ఉంది. అక్షరాస్యతో ముందున్న మన రాష్ట్రానికి ఇది సిగ్గుచేటు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మన రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మహిళల గౌరవానికి వరకట్నం భంగం కలిగిస్తుంది. ఏ యువకుడైనా తన పెళ్లికి కట్నం డిమాండ్ చేస్తే అతడు చదువును, దేశాన్ని అవమానించినట్లేనని గాంధీజీ చెప్పారు. ఎవరూ కట్నం తీసుకోబోమని యువత ప్రతిజ్ఞ చేయాలి. వరకట్న వేధింపులకు ముగింపు పలకాలి. అని మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పేర్కొన్నారు.
వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేరళ గవర్నర్ అభిప్రాయపడ్డారు. మహిళల గౌరవానికి సంబంధించి కేరళ ప్రభుత్వం చేపట్టిన స్త్రీపక్ష కేరళం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన 6 గంటలకు విరమిస్తారు. సాయంత్రం 5 గంటలలకు గాంధీ భవన్‌కు వెళ్లి.. వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలను మద్దతు తెలుపుతారు. కాగా, గత నెలలో ఓ మెడికల్ విద్యార్థిని తన భర్త వరకట్న వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మెడిసిన్ చదువున్న మహిళ వరకట్నానికి బలవడం.. అది కూడా కేరళలాంటి అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో జరగడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వరకట్నానికి వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాలు, ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.