Kerala Gold Scam | కేరళ గోల్డ్ స్కాంలో మరో సంచలనం..

Kerala Gold Scam | పినరయి విజయన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష యూడీఎఫ్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించింది.

news18-telugu
Updated: July 17, 2020, 3:12 PM IST
Kerala Gold Scam | కేరళ గోల్డ్ స్కాంలో మరో సంచలనం..
స్వప్న సురేష్, సీఎం పినరయి విజయన్
  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించి కేరళ గోల్డ్ స్కాంలో మరో బ్రేకింగ్ న్యూస్. ఈ కేసు అటు తిరిగి, ఇటు తిరిగి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎసరు పెడుతోంది. విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రకటించింది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మీద నో కాన్ఫిడెన్స్ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, రమేష్ చెన్నితల ధ్రువీకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీషన్ అవిశ్వాస తీర్మానం అందజేసినట్టు రమేష్ చెన్నితల తెలిపారు. మరోవైపు కేరళ ఫైనాన్స్ బిల్లును పాస్ చేయడానికి ఈనెల 27న కేరళ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ గోల్డ్ స్కాంలో సీఎం విజయన్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. శివశంకర్ పై గురువారం సస్పెన్షన్ వేటు పడింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారులుగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ను ఐటీ శాఖలో చేర్చుకోవడం దగ్గర్నుంచి, ఆమెతో ఇతర సంబంధాలను కూడా కలిగి ఉన్నారనే ఆరోపణలపై శివశంకర్ ను గత వారం బదిలీ చేశారు.

సాంకేతికంగా చూస్తే విజయన్ ప్రభుత్వానికి నెంబర్స్ పరంగా ఎలాంటి సమస్య లేదు. అయితే, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. విజయన్ జీవితంలో ఇదో మచ్చ అనే భావన కేరళ ప్రజల్లో కనిపిస్తుందని రమేష్ చెన్నితల అన్నారు. ఇప్పటికే ఇద్దరు ఉన్నతాధికారులు రాజీనామా చేశారని, ఇక విజయన్ రాజీనామానే మిగిలి ఉందని రమేష్ చెన్నితల అభిప్రాయపడ్డారు. దీని వెనుక సీఎంఓ హస్తం ఉందని తాము అనుమానాలు లేవనెత్తినప్పుడు విజయన్ వాటిని తిరస్కరించారని, ఇప్పుడు ఏకంగా ఇద్దరు ఉన్నతాధికారులను తప్పించారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఐటీ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు విజయన్. ఇప్పుడు ఐటీ శాఖ అసాంఘిక కార్యక్రమాలకు డెన్ గా మారిందని రమేష్ అన్నారు.

ఇండియాతోపాటు గల్ఫ్ దేశాల్లోనూ సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు, అనుమానితుల్ని ఒక్కొక్కరుగా విచారిస్తోన్న ఎన్ఐఏ.. ఆధారాలను సేకరించే పనిలో బిజీగా ఉంది. ఇక విజయన్ మంత్రి వర్గ సభ్యుడు, విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ తరచూ స్వప్న సురేశ్ తో ఫోన్లో మాట్లాడినట్లు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఎన్ఐఏ సేకరించిన స్వప్న కాల్ డేటాలో ఈ విషయం బయటపడింది. తాను స్వప్నతో పోన్లో మాట్లాడిన మాట నిజమేనని ఒప్పుకున్న మంత్రి.. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంతో మాత్రం సంబంధం లేదని చెప్పుకున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 17, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading