KERALA GOLD SMUGGLING CASE SWAPNA SURESH SAYS TOLD COURT THAT CM HIS WIFE DAUGHTER INVOLVED PVN
Kerala Gold Smuggling Case : గోల్డ్ స్మగ్లింగ్ లో సీఎం విజయన్ హస్తం..రాజీనామాకు డిమాండ్..సీఎంకి భారీ భద్రత!
స్వప్న సురేష్, సీఎం పినరయి విజయన్ (ఫైల్ ఫొటో)
Kerala Gold Smuggling Case : కేరళ రాష్ట్రంలో గతంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గతేడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విషయం చుట్టూ కేరళ రాజకీయాలు తిరిగాయన్న విషయం కూడా తెలిసిందే.
Kerala Gold Smuggling Case : కేరళ(Kerala) రాష్ట్రంలో గతంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గతేడాది కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విషయం చుట్టూ కేరళ రాజకీయాలు తిరిగాయన్న విషయం కూడా తెలిసిందే. అయితే బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్(Swapna Suresh) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కారణంగానే తాను బంగారం స్మగ్లింగ్‌లో ఇరుక్కున్నట్లు స్వప్న సురేశ్ వెల్లడించారు. ఈ కేసుతో కేరళ సీఎం పినరయి విజయన్(CM Pinarayi Vijayan), ఆయన భార్య కమలా విజయన్, కూతురు వీణా విజయన్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నళిని నెట్టో, సీఎం అదనపు వ్యక్తిగత కార్యదర్శి సీఎం రవీంద్రన్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీ జలీల్‌లకు సంబంధం ఉందని స్వప్న సురేశ్ ఆరోపించారు. మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు.
2016లో కేరళ సీఎంగా పినరాయి విజయన్ తొలిసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వెళ్లినప్పుడు బంగారం స్మగ్లింగ్ మొదలైందని స్వప్న సురేశ్ ఆరోపించారు. యూఏఈలో పినరాయి విజయ్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సీఎం విజయన్ ముఖ్య మాజీ కార్యదర్శి శివశంకర్ తనను ఆదేశించారని స్వప్న సురేశ్ తెలిపారు. ఆ మరుసటిరోజు సీఎం విజయన్ త్రివేండ్రంలో బ్యాగ్ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్ చేర్చాలని తనకు శివశంకర్ చెప్పారని.. ఈ క్రమంలో దుబాయ్ కాన్సులేట్‌లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్‌ను తాను ఇచ్చానని..కానీ అక్కడ స్కానింగ్‌లో బ్యాగ్ నిండా డబ్బు ఉన్నట్లు తెలిసింది... ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్‌లో భాగం కావాల్సి వచ్చింది... అంతేకాదు,దుబాయ్ కాన్సులేట్ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు అని స్వప్న సురేశ్ కోర్టుకి తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడించడం వెనుక తనకు మరో ఉద్దేశం లేదని స్వప్న అన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉన్న కారణంగా ఈ వివరాలను గోప్యంగా కోర్టుకు వివరించినట్లు తెలిపారు. మీడియా ఈ కేసును దర్యాప్తు చేసి నిజాలను బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కాగా,స్వప్న సురేష్ వ్యాఖ్యలు సంకుచితం అని శివశంకర్ వ్యాఖ్యానించారు. నళిని నెట్టో స్పందించడానికి నిరాకరించారు.
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్ సీఎంపై ఆరోపణల నేపథ్యంలో...కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సుధాకరన్ మంగళవారం సీఎం విజయన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి బిర్యానీ పాత్రలో బంగారం స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయన్ రాజీనామా చేయాలని, కోర్టు పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై చాలా ఏజెన్సీలు విచారణ జరిపి చివరికి బీజేపీ, సీపీఎం మధ్య కుదిరిన విషయం తెలిసిందే. విజయన్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. ఇది నిజంగా సిగ్గుచేటు మరియు సీఎం రాజీనామా చేయాలి" అని కేరళ కాంగ్రెస్(Kerala Congress) అధ్యక్షుడు కె. సుధాకరన్ అన్నారు. మరోవైపు,సీఎం విజయన్ విమానాశ్రయానికి వచ్చినప్పుడు మీడియా సిబ్బంది ఆయన దగ్గరికి ఎక్కడా రాకుండా కేరళ పోలీసులు మంగళవారం ఆయన కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
కాగా,కేరళ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, తిరువనంతపురం ఎయిర్ పోర్టులో జూలై 6,2020న ఒకేసారి 30 కేజీల బంగారం పట్టుపడింది. యూఏఈ నుంచి డిప్లొమాటిక్ పాస్ పోర్టుపై వచ్చిన సరిత్ కుమార్ అనే వ్యక్తి బ్యాగులో ఇది దొరికింది. తాను యూఏఈ రాయబార కార్యాలయం ఉద్యోగినని దబాయించిన అతను.. చివరికి నిజం కక్కేయడంతో ఈ గోల్ట్ స్మగ్లిండ్ సెన్సేషనల్ క్రైమ్ బయటపడింది. ఈ కేసులో UAE కాన్సులేట్ మాజీ ఉద్యోగి స్వప్న సురేష్ అరెస్టయిన 16 నెలల తర్వాత నవంబర్ 2021లో జైలు నుండి విడుదలైంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.