కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో సీఎం పినరయి విజయన్ ప్రమేయంపై NIA దర్యాప్తు?

Kerala gold smuggling case | దేశంలో కలకలం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌తో పాటు సీఎం కార్యాలయం ప్రమేయంపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నట్లు ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.

news18-telugu
Updated: August 6, 2020, 12:15 PM IST
కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో సీఎం పినరయి విజయన్ ప్రమేయంపై NIA దర్యాప్తు?
కేరళ సీఎం పినరయి విజయన్(File)
  • Share this:
దేశంలో తీవ్ర కలకలం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సంచలన విషయాలు వెల్లడించింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రెండో నిందితురాలై స్వప్న సురేశ్‌ బెయిల్ పిటిషన్‌పై తిరువనంతపురం ఎన్ఐఏ కోర్టులో గురువారం వాదలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం పినరయి విజయన్, సీఎం కార్యాలయం ప్రమేయంపై అనుమానం వ్యక్తంచేశారు.  దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నట్లు ఎన్ఏఏ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

నిందితురాలు స్వప్న సురేశ్‌కి పినరయి విజయన్‌‌తో పరిచయం ఉందని..దీనిపై లోతుగా దర్యాప్తు జరుతున్నట్లు స్పష్టంచేశారు. దర్యాప్తు కీలక దశకు చేరిన తరుణంలో స్వప్నతో పాటు మిగిలిన నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే...దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయి విజయన్‌తో పాటు సీఎం కార్యాలయంలోని ఇతర అధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరపాలని ఎన్ఐఏ నిర్ణయించుకోవడం కేరళలో రాజకీయ దుమారంరేపుతోంది.
Published by: Janardhan V
First published: August 6, 2020, 12:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading