హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kerala Floods: వర్షాలతో తల్లడిల్లుతున్న కేరళ.. వరద బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు..

Kerala Floods: వర్షాలతో తల్లడిల్లుతున్న కేరళ.. వరద బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు..

Kerala Heavy Rains: కొట్టాయంలో ఐదు ఇళ్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. అక్కడ ఇప్పటి వరకు నలుగురు మరణించారు.

కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావంతో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు ఊర్లన్నీ సరస్సులను తలపిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. వరదలతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 2018లో వచ్చిన వరదర విలయాన్ని మరవక ముందే కేరళపై ప్రకృతి మరోసారి పగబట్టింది. మళ్లీ ఏం జరుగుతుందోనని జనం వణికిపోతున్నారు. కేరళలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. పలువురు గల్లంతయ్యారు. కొట్టాయంలో ఐదు ఇళ్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. అక్కడ ఇప్పటి వరకు నలుగురు మరణించారు. ఇడుక్కి జిల్లాలో మరో ఇద్దరు చనిపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దించి వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

కేరళలో వర్షాల బీభత్స ఎలా ఉందో ఈ కింది వీడియోల్లో చూడండి..

కేరళలో రేపటి నుంచి కాలేజీలు తెరవాలని అనుకున్నారు. కానీ అనూహ్యం వర్షాలు విరుచుకుపడడంతో కాలేజీల ప్రారంభాన్ని వాయిదా వేశారు. అక్టోబరు 20 తర్వాతే కాలేజీలను తెరుస్తామనీ సీఎం పినరయి విజయన్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులెవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. అక్టోబరు 19 వరకు శబరిమల టూర్‌ను వాయిదా వేసుకోవాలని సూచించారు.

First published:

Tags: Kerala, Kerala floods, Kerala rains

ఉత్తమ కథలు