హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే నమ్ముతారా? అందరికీ అర్థమయ్యేలా ముత్యాల్లాంటి అక్షరాలు

ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే నమ్ముతారా? అందరికీ అర్థమయ్యేలా ముత్యాల్లాంటి అక్షరాలు

డాక్టర్ ప్రిస్క్రిప్షన్

డాక్టర్ ప్రిస్క్రిప్షన్

కేరళకు చెంది ఓ డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ముత్యాల్లాంటి అందమైన అక్షరాలతో.. చక్కగా రాస్తారు. క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయడం వల్ల.. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మనకు ఒంట్లో బాగాలేకుంటే ఆస్పత్రికి వెళ్తాం. అక్కడ పరీక్షలు చేసి.. మందుల చీటి రాసిస్తాడు. దానిని మెడికల్ షాప్‌కు తీసుకెళ్తే మందులు ఇస్తారు. ఐతే డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్  (Doctor Prescription) ఎవరికీ అర్థం కాదు. రాసిన డాక్టర్‌కి.. ముందులిచ్చే ఫార్మాసిస్ట్‌కు తప్ప.. ఎవరూ కూడా దానిని చదవలేరు. ఆ రాత అంత గందరగోళంగా ఉంటుంది. గజిబిజిగా కనిపిస్తుంది. చిన్న పిల్లలు పిచ్చి రాతలు రాసినట్లుగా..అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ కేరళ (Kerala)లోని ఓ డాక్టర్ రాస్తే మాత్రం.. అందరికీ అర్థమవుతుంది. అది ఏ మందు? ఎంత మోతాదు? ఎప్పుడు వేసకోవాలన్న పూర్తి వివరాలు.. ఇట్టే అర్థమయిపోతాయి. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను ఆయన అంత చక్కగా రాస్తారు. క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయడం వల్ల.. చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది.

  నితిన్ నారాయణన్ అనే డాక్టర్ పాలక్కడ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పీడియాట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం త్రిస్సూరు జిల్లాలోని పడియూరు. త్రిస్సూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER)లో MD పూర్తి చేశారు. గత మూడేళ్లుగా పాలక్కడ్ CHCలో వైద్యుడి సేవలందిస్తున్నారు. డాక్టర్లు రోగులకు అర్థమయ్యేలా ప్రిస్క్రిప్షన్‌ రాయాలని ఎన్నో ఏజెన్సీలు చెప్పినా.. ఇప్పటికీ చాలా మంది మందుల చీటిని స్పష్టంగా రాయరు. గజిబిజి గందరగోళంగా రాస్తారు. కానీ నితిన్ నారయణన్ అందరిలా కాదు. మెడికల్ షాప్ నిర్వహాకులతో పాటు రోగులకు కూడా స్పష్టంగా అర్థమయ్యేలా.. క్యాపిటల్ లెటర్స్‌లో ప్క్రిస్క్రిప్షన్ రాస్తారు. పెద్ద అక్షరాల్లో రాయడం వల్ల.. ఆయన రాసిన మందుల వివరాల చాలా ఈజీగా అర్ధమవుతాయి.

  డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అర్థం కాక రోగులు తికమక పడుతుంటారని.. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే.. క్యాపిటల్ లెటర్స్‌లో తాను మందుల చీటిని రాస్తానని నితిన్ నారాయణన్ తెలిపారు. చిన్నప్పటి నుంచి తన చేతి రాత ఎంతో బాగుటుందని.. గుండ్రంగా స్పష్టంగా రాయడం అలవాటని ఆయన అన్నారు. డాక్టర్ అయ్యాక కూడా.. దానిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఓ రోగికి రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో నాలుగు రకాల మందులున్నాయి. ఏ మందు ఎంత మోతాదులో.. ఎన్నిసార్లు... ఎన్ని రోజుల పాటు తీసుకోవాలో అందులో స్పష్టంగా ఉంది. ఆ మందుల చీటిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలాంటి డాక్టర్లు అంతటా ఉంటే.. ఎంత బాగుంటుదో అని కామెంట్స్ చేస్తున్నారు. మిగతా డాక్టర్లు కూడా నితిన్ నారాయణన్‌ను ఫాలో అవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Doctors, Kerala, VIRAL NEWS

  ఉత్తమ కథలు