• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • KERALA CM PINARAYI VIJAYAN PICKS HIS SON IN LAW INTO CABINET DROPS EX HEALTH MINISTER KK SHAILAJA GH SK

Kerala: కరోనాను కట్టడిచేసిన ఆ మంత్రికి షాక్.. సీఎం అల్లుడికి మంత్రి పదవి.. అంతా కొత్త వారే

కేరళ సీఎం పినరయి విజయన్

కరోనా కట్టడికి పఠిష్టమైన చర్యలు తీసుకొని అందరి మన్నలు పొందిన ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది.

  • Share this:
కేరళలో వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన పినరయి విజయన్.. 21 మందితో నూతన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి తన మంత్రివర్గంలోకి అంతా కొత్త వారినే తీసుకున్నారు. ముఖ్యమంత్రి పినరాయి విజయన్​ తప్ప మిగతా వారంతా కొత్తవారే కావడం విశేషం. గతంలో మంత్రిగా పనిచేసిన ఒక్కరికి కూడా తాజా ప్రభుత్వంలో అవకాశం ఇవ్వలేదు. అయితే మిగతా వారి సంగతెలా ఉన్నా.. కరోనా కట్టడికి పఠిష్టమైన చర్యలు తీసుకొని అందరి మన్నలు పొందిన ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ఈసారి చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రిగా కంటే శైలజా టీచర్​గానే ఆమె సుప్రసిద్ధురాలు.. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 60 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కరోనా వైరస్​ను తరిమికొట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రధాని మోదీతో సహా అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు.

తన పనితీరుతో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన కేకే శైలజకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంపై పినరయి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విజయన్​ అల్లుడు మొహమ్మద్​ రియాజ్​​కు మంత్రి వర్గంలో బెర్త్​ దక్కడం గమనార్హం. వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పుకునే వామపక్ష పార్టీలు కూడా ఇలా తమ కుటుంబ సభ్యులకు పెద్ద పీట వేయడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కేరళ ఎల్డీఎఫ్​ ప్రభుత్వంలో కొత్తగా మంత్రి పదవులు పొందిన తాజా జాబితాలో మొహ్మద్​ రియాజ్​ పేరు అందరిన్నీ ఆకర్షించడంతో పాటు సంచలనంగా మారింది.

గతేడాది విజయన్ కుమార్తె వీణను మహ్మద్ రియాజ్​ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఈసారి అందరూ కొత్త వారినే మంత్రి వర్గంలోకి తీసుకోవాలని హైకమాండ్​ భావించడంతో విజయన్​ అల్లుడికి అవకాశం దక్కింది. అంతేకాక, యువతకు పెద్దపీట వేయాలనుకోవడం కూడా రియాజ్​కు కలిసొచ్చింది. అంతడు ఇంతకు ముందు సీపీఎం యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

అయితే, తన మంత్రివర్గంలో కొత్త వారికే చోటుకల్పించాలని పినరయి విజయన్ భావించినప్పటికీ, పాత మంత్రుల్లో శైలజ ఒక్కరినైనా కొనసాగించాల్సిందిగా పార్టీ హైకమాండ్​ నుంచి ఒత్తిడి వచ్చింది. అయినా సరే విజయన్​ ఖాతరు చేయలేదని తెలుస్తోంది. కరోనా సమయంలో బాగా పనిచేసినంత మాత్రాన శైలజకు మినహాయింపు ఇవ్వడం సరికాదని సీఎం హైకమాండ్​కు చెప్పినట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ సెక్రటరీ హోదాలో శైలజకు ప్రభుత్వ విప్​ కట్టబెట్టారు.
Published by:Shiva Kumar Addula
First published: