భారత్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. సెప్టెంబరు లేదా అక్టోబరులో కరోనా మూడో దశ వ్యాప్తి ఉంటుందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో రోజువారీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కేరళ కేంద్రంగానే కొత్త కేసులు అనూహ్య రీతిలో పెరుగుతున్నాయి. ఆ ఒక్క రాష్ట్రంలోనే ప్రతి రోజు 30వేల మందికి పైగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. టెస్ట్‌లు ఎక్కువగా చేస్తున్నారు..అందుకే ఎక్కువగా వస్తున్నాయని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అక్కడ పాజిటివిటీ రేటు 20శాతానికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కేసులు పెరుగుతున్నందున మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. కేరళలో మళ్లీ రాత్రి కర్ఫ్యూని విధిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కేరళ వ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లోఉంటుంది. ఆ సమయంలో ఎవరూ బయటకు రాకూడదు. ఆవశ్యక, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. సోమవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
Of 1,67,497 samples tested today, 31,265 samples tested positive for #COVID19 and 153 deaths reported in the state: Kerala CM Pinarayi Vijayan
— ANI (@ANI) August 28, 2021
Indian Railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ కోచ్ టికెట్స్
''కేరళలో యుద్ధ ప్రాతిపాదికన వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. జనాభా ప్రకారం చూస్తే.. దేశంలో అత్యంత వేగంగా టీకాలు వేస్తున్న రాష్ట్రం కేరళ. ప్రతి రోజూ 5 లక్షల డోసుల టీకాలు వేస్తున్నాం. మరణాల రేటు అదుపులోనే ఉంది. కానీ కొత్త కేసులు మాత్రం పెరుగుతున్నాయి. సెప్టెంబరు ఆఖరు నాటికి 18ఏళ్లు నిండిన అందరికీ టీకా పంపిణీని పూర్తి చేస్తాం.'' అని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
వాహనాల రిజిస్ట్రేషన్‌కు కొత్త సిరీస్.. భారత్ పేరుతో BH సిరీస్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
గత నాలుగు రోజులుగా కేరళలో నిత్యం 30 వేలకుపైగా కరోనా కేసులు వస్తున్నాయి. ఇవాళ 1,67,497 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 31,265 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేడు మరో 153 మంది మరణించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. కోవిడ్ ఆంక్షలను సడలించిన తర్వాత ప్రజలు నిబంధనలను గాలికి వదిలేశారని.. అందుకే మళ్లీ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఇవాళ కరోనా పాజిటివ్ రేటు 18.6శాతంగా ఉంది. అంటే పరీక్షలు చేయించుకున్న ప్రతి 100 మందిలో 18 మంది కరోనా బారినపడుతున్నారు. మరే రాష్ట్రంలో ఈస్థాయిలో కరోనా వ్యాప్తి లేదు. మణిపూర్‌లో 11.06 శాతం, సిక్కింలో 9.52 శాతం ఉంది. మహారాష్ట్ర కేంద్రంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాపించినట్లుగానే.. కేరళ కేంద్రంగా మూడో దశ వ్యాప్తి జరుగుతోందనే అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Neelakurinji flowers: అరుదైన పూలు.. 12 ఏళ్లకోసారి పూస్తాయి
శనివారం కరోనా బులెటిన్ ప్రకారం.. ఇండియాలో కొత్తగా 46,759 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 509 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,37,370కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. మన దేశంలో కొత్తగా 31,374 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,18,52,8028కి చేరింది. రికవరీ రేటు 97.6 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,61,110 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 51 కోట్ల 68 లక్షల 87 వేల 602 టెస్టులు చేశారు. కొత్తగా 1,03,35,290 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 62 కోట్ల 29 లక్షల 89 వేల 134 వ్యాక్సిన్లు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona bulletin, Corona cases, Coronavirus, Covid-19, Kerala