Made liquor after watching youtube:ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్(Youtube)ను చూసి వంటలు ఎలా చేయడం నేర్చుకుంటున్నారు. యూట్యూబ్ లో వీడియోలు చూసి ఆపరేషన్లు కూడా చేస్తున్నారు,బాంబులు కూడా తయారు చేస్తున్నారు. అయితే తాజాగా కేరళ(Kerala)కు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్ లో వీడియో చూసి లిక్కర్(Liquor)తయారుచేశాడు. తిరువనంతపురంకు చెందిన 12 ఏళ్ల బాలుడు యూట్యూబ్ లో వీడియో చూసిన తర్వాత ద్రాక్షతో వైన్ తయారు చేసి తన క్లాస్ మేట్స్ లో ఒకరి వద్దకు వెళ్లి అతడికి దీన్ని ఇచ్చాడు. అయితే ఈ మద్యం తాగిన తర్వాత ఆ బాలుడు అసౌకర్యంగా, వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత సమీపంలోని చిరింకిజులోని హాస్పిటల్(Hospital)లో చేర్పించారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
ప్రస్తుతం ఆ బాలుడిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లను ఉపయోగించి మద్యం తయారు చేసినట్లు పోలీసుల విచారణలో బాలుడు అంగీకరించాడని పోలీసు అధికారి తెలిపారు. మద్యం తయారు చేయడానికి స్పిరిట్స్ లేదా మరే ఇతర రకమైన ఆల్కహాల్ ఉపయోగించలేదని బాలుడు చెప్పాడన్నారు. అయితే అతను మద్యం తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలుడి తల్లికి తెలుసని, కానీ ఆమె దానిని సీరియస్ గా తీసుకోలేదని చెప్పారు.
American Woman Pregnant: ఈమె 16 ఏళ్లు వరుసగా గర్భవతి,12మంది పిల్లలకు తల్లి,అయినా ఇంకా
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాటిల్ నుంచి మద్యం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. మద్యంలో స్పిరిట్ లేదా మరేదైనా రకమైన ఆల్కహాల్ జోడించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు. మద్యంలో స్పిరిట్ లేదా మరేదైనా రకమైన ఆల్కహాల్ ఉపయోగించినట్లు రుజువైతే జువెనైల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలిపానే. ఈ కేసుకు సంబంధించిన చట్టపరమైన పరిణామాల గురించి పోలీసులు బాలుడి తల్లిదండ్రులు, పాఠశాల అధికారులకు సమాచారం అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.