• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • KERALA ASSEMBLY ELECTIONS 2021 MALLUWOOD SUPERSTAR MAMMOOTTY CAST HIS VOTE IN KERALA TA

Kerala Assembly Elections 2021: కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మమ్ముట్టి..

కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మమ్ముట్టి (Twitter/Photo)

Kerala Assembly Elections 2021:  దేశవ్యాప్తంగా నాలుగు కీలక రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళలతో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎన్నికల్లో పలువురు సెలబ్రిటీలు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు.

  • Share this:
    Kerala Assembly Elections 2021:  దేశవ్యాప్తంగా నాలుగు కీలక రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, కేరళలతో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి సామాన్యులతో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.మరోవైపు తమిళ అగ్ర హీరోలైన విజయ్, సూర్య, కార్తి సోదురులు కూడా లైన్‌లో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు కేరళలో కూడా ఒకే దశలో 140 అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.

    ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో పాటు రమేష్ చెన్నితలతో పాటు కేరళ బీజేపీ సీఎం కాండిడేట్ మెట్రో శ్రీధరన్ కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మలయాళ సినీ నటులు పృథ్వీరాజ్‌తో పాటు కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక బెంగాల్‌లో మరో ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ తర్వాత నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మే 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: