2010నాటి మంగళూరు దుర్ఘటనను జ్ఞప్తికి తెచ్చిన కేరళ విమాన ప్రమాదం

దశాబ్ధం క్రితం 2010 మే మాసంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ అవుతూ కూలిపోయింది. నాటి ఘటనలో 160 మంది ప్రయాణీకులు, సిబ్బంది మృతి చెందారు. కేరళలో జరిగిన నేటి ప్రమాదం నాటి దుర్ఘటనను గుర్తుకు తెచ్చింది.

news18-telugu
Updated: August 7, 2020, 10:39 PM IST
2010నాటి మంగళూరు దుర్ఘటనను జ్ఞప్తికి తెచ్చిన కేరళ విమాన ప్రమాదం
కేరళ విమాన ప్రమాదం
  • Share this:
కేరళలో జరిగిన విమాన ప్రమాదం 2010 మే నెల 22న మంగళూరులో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చింది. నాటి ప్రమాదంలో 160 మంది ప్రయాణీకులు, సిబ్బంది దుర్మరణం చెందారు. దుబాయ్ నుంచి మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం...ల్యాండ్ అవుతున్న సమయంలోనే కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి 8 మంది ప్రయాణీకులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి గురైన వెంటనే వారు బయటకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. దేశ పౌర విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ప్రమాద ఘటనల్లో ఒకటిగా మంగళూరు విమాన ప్రమాద ఘటన నిలుస్తోంది. ఇప్పుడు అదే విదంగా కోజికోడ్‌లో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూలిపోవడం అందరినీ షాక్ కి గురిచేసింది.

కేరళ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం


దశాబ్ధకాలం తర్వాత కేరళలోనూ ఇదే తరహా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం ల్యాండింగ్ అవుతూ కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తోంది. రన్‌వేపై నీరు ఉండటంతో విమానం స్కిడ్ అయినట్లు భావిస్తున్నారు. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలయ్యింది. అయితే కూలిపోయిన విమానం నుంచి మంటలు చలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా...123 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది.  వీరిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స కల్పిస్తున్నారు.
Published by: Janardhan V
First published: August 7, 2020, 10:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading