• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • KERALA AIR INDIA EXPRESS FLIGHT ACCIDENT UPDATES KERALA PLANE CRASH 3 DIES AND 50 INJURED

Kerala Plane Crash: 14 మంది దుర్మరణం...123 మందికి పైగా గాయాలు

కేరళలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదం

Kerala plane crash | కేరళలో జరిగిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందగా... 123 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

  • Share this:
    కేరళలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. దుబాయ్ నుంచి కోజికోడ్‌కు వచ్చిన ప్రయాణీకుల ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం(IX 1344)...కోజికోడ్‌లోని కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. రాత్రి 7.41 గం.లకు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తోంది. రన్‌వేపై వర్షపు నీరు కారణంగా విమానం స్కిడ్ అయినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న విమానంలో 174 మంది ప్రయాణీకులు, 10 మంది శిశువులు, ఐదుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లు ఉన్నారు. కూలిన వెంటనే విమానం రెండు తునకలయ్యింది. అయితే అదృష్టవశాత్తు విమాన శకలాల నుంచి మంటలు చెలరేగలేదు.

    ఈ ప్రమాదంలో 14 మంది దుర్మరణం చెందగా...123 మంది గాయపడినట్లు మలప్పురం ఎస్పీ తెలిపారు. క్షతగాత్రుల్లో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.పలువురు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స కల్పిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ విమాన ప్రమాదంపై డీజీసీఏ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.



    kerala plane crash, kerala plane crash news, kerala plane crash updates, kerala fligh accident, air india express crash, kerala plane accident, కేరళ విమాన ప్రమాదం, కేరళలో కూలిన విమానం, ఎయిరిండియా విమాన ప్రమాదం, కేరళ
    కేరళ విమాన ప్రమాదం


    కేరళ విమాన ప్రమాదం


    ల్యాండ్ అవుతూ కూలిపోయిన విమానం నుంచి అదృష్టవశాత్తు మంటలు చెలరేగలేదు. మంటలు చెలరేగి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగేదని అధికారులు చెబుతున్నారు.

    హెల్ప్ లైన్ నంబర్లు- 056 546 3903, 0543090572, 0543090572, 0543090575,

    ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణీకుల కుటుంబీకులు హెల్ప్ లైన్ 0495 - 2376901ను సంప్రదించవచ్చని కోజికోడ్ జిల్లా కలెక్టర్ తెలిపారు.

    kerala plane crash, kerala plane crash news, kerala plane crash updates, kerala fligh accident, air india express crash, kerala plane accident, కేరళ విమాన ప్రమాదం, కేరళలో కూలిన విమానం, ఎయిరిండియా విమాన ప్రమాదం, కేరళ
    కేరళ విమాన ప్రమాదం


    ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్యం చేశారు. సంబంధిత వర్గాలు సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు.



    కేరళ విమాన ప్రమాద ఘటన యావత్ దేశ ప్రజలను షాక్‌కు గురిచేసింది.
    Published by:Janardhan V
    First published: