Home /News /national /

18 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. 10 ఏళ్ల పాటు సీక్రెట్‌గా అక్కడే.. ఇప్పుడిలా..

18 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. 10 ఏళ్ల పాటు సీక్రెట్‌గా అక్కడే.. ఇప్పుడిలా..

రెహమాన్, సజిత

రెహమాన్, సజిత

రెహమాన్, సజిత ఇద్దరు ప్రేమికులు. 2010లో సజిత.. రెహమాన్‌ను వివాహం చేసుకోవడానికి ఆమె ఇంటి నుండి బయలుదేరింది. అప్పుడు సజితకు 18 సంవత్సరాలు.

    ఓ వ్యక్తి తన ప్రేయసిని పదేళ్ల పాటు ప్రపంచానికి కనిపించకుండా.. ఓ గదిలో బంధించిన ఘటన కొద్ది నెలల కిందట వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మరో ఆసక్తికర ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రెహమాన్, సజిత ఇద్దరు ప్రేమికులు. 2010లో సజిత.. రెహమాన్‌ను వివాహం చేసుకోవడానికి ఆమె ఇంటి నుండి బయలుదేరింది. అప్పుడు సజితకు 18 సంవత్సరాలు. రెహమాన్ ఎలక్ట్రిక్, పెయింటింగ్ మీద వర్క్ చేసేవాడు. సజిత్ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత.. రెహమాన్ వద్దకు చేరుకుంది. దీంతో రెహమాన్ ఆమెను తన ఇంట్లోనే 10 ఏళ్ల పాటు ఎవరికి తెలియకుండా ఉంచాడు. అయితే పదేళ్ల తర్వాత ఈ ఏడాది.. వితనస్సేరీలోని ఒక చిన్న ఇంటికి మారారు. అయితే రెహమాన్ ఆచూకీ కనిపించడం లేదని.. అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు.

    అయితే నేన్మారా (Nenmara)‌లో రెహమాన్ ఆచూకీ గుర్తించిన అతడి సోదరుడు.. పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో పోలీసులు రెహమాన్‌ను అదుపులోకి తీసుకన్నారు. అతడిని విచారించగా సజితతో అతని ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొలుతు రెహమాన్.. సజితను బలవంతంగా బంధించాడని అనున్నప్పటికీ.. వారిద్దరు ఇష్టంతోనే కలిసి ఉంటున్నామని చెప్పారు. తాము చట్టప్రకారం పెళ్లి చేసుకోలేదని.. సహజీవనం చేస్తున్నామని చెప్పారు. సజిత కూడా తాను రెహమాన్‌ను ప్రేమిస్తున్నట్టుగా తెలిపింది. దీంతో పోలీసులు ఆ కేసును మూసివేశారు.

    IPL 2021: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఫ్యాన్స్‌కి ఎంట్రీ.. ఆన్‌లైన్‌లో టికెట్లు ఎప్పటి నుంచి అంటే..

    అయితే తాజాగా రెహమాన్, సజిత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పదేళ్ల తర్వాత వీరిద్దరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్(Special Marriage Act) నేన్మారాలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బుధవారం పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను పురగోమన కళా సాహిత్య సంఘం కొల్లంకోడు సమితి (Purogamana Kala Sahitya Sangham Kollankodu committee) చేసింది. పెళ్లికి కొత్త బట్టలతో పాటుగా, వేడుకకు అవసరమైన సాయం కూడా చేసింది.

    Shocking: అతడు డాక్టర్.. ఆమె టీచర్.. 9 ఏళ్ల క్రితం నాటి వీడియోలతో..

    రెహమాన్, సజిత 10 ఏళ్ల సహజీవనం తర్వాత.. ఇలా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత రెహమాన్ స్పందిస్తూ.. ‘అధికారిక వివాహం మా ఇద్దరినీ కాపాడుతుందని మాకు తెలుసు. ఇప్పుడు మేము సుఖంగా ఉన్నాము, మేము సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నాం’అని చెప్పారు. ఇక, సంతోషంగా జీవించాలనేది తమ తదుపరి కోరిక అని నూతన దంపతులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Kerala, Lovers

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు