జగన్ సక్సెస్ ఫుల్ ఫార్ములాను అమలు చేస్తున్న కేరళ...

ఏపీ తరహాలో కేరళలో కూడా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అమలు చేయాలని ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ నిర్ణయించారు.

news18-telugu
Updated: March 29, 2020, 12:36 PM IST
జగన్ సక్సెస్ ఫుల్ ఫార్ములాను అమలు చేస్తున్న కేరళ...
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసపుత్రిక గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలోని పొరుగు రాష్ట్రం కూడా ఇప్పుడు గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఆ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 2.36 లక్షల మంది వాలంటీర్లను నియమించాలని ఆదేశించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం భారీ ఎత్తున చర్యలు తీసుకోనుంది. కేరళలో 941 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీకి 200 మంది చొప్పున వాలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. అలాగే, 87 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక్కో మున్సిపాలిటీకి 500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. కార్పొరేషన్లలో 750 మంది వాలంటీర్లను రిక్రూట్ చేయనున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, యూకే కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వాలంటీర్లను రిక్రూట్ చేసుకోవాలని చూస్తోంది.

supreme court,caa protest,kerala,caa,kerala news,supreme court on caa,supreme court caa,caa plea hearing in supreme court,anti caa protest,supreme court caa petition,kerala anti caa protest,supreme court on amu,supreme court on jamia,kerala caa,supreme court verdict,kerala breaking news,kerala live news,caa protests,supreme court judgement on kochi building,caa kerala
పినరయ్ విజయన్


ఆంధ్రప్రదేశ్‌లోవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పారు. వారికి నెలకు రూ.5000 గౌరవ వేతనం అందిస్తున్నారు. ప్రభుత్వం అందించే పథకాలు అన్నీ ఈ వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నారు. ఒక్కో వాలంటీర్‌కు 50 ఇళ్లు కేటాయించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించిన నేపథ్యంలో ఇంటింటికీ తిరిగి వైద్య, రెవిన్యూ శాఖ అధికారులు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడం ఇబ్బందిగా మారింది. అయితే, ఏపీలో మాత్రం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ముందు నుంచి ఉండడం వల్ల ఆ వాలంటీర్ తనకు కేటాయించిన 50 కుటుంబాలను కలిసి.. ఈ మధ్యకాలంలో ఆయా కుటుంబాల్లో విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. ఇది సఫలీకృతం కావడంతో ఇతర రాష్ట్రాలు కూడా అదే బాటలో నడవనున్నట్టు తెలుస్తోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 29, 2020, 12:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading