కేజ్రీవాల్‌కి తెగ నచ్చేసిన ఉల్లి వ్యాపారి వీడియో... కలవాలనుకుంటున్నానని ట్వీట్...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అధికార ఆప్ అత్యంత ఉత్సాహంగా రెడీ అవుతోంది. ఆల్రెడీ గెలిచేసినట్లే అనే కాన్ఫిడెన్స్ ఆ పార్టీలో కుప్పలు తెప్పలుగా కనిపిస్తోంది.

news18-telugu
Updated: January 15, 2020, 10:05 AM IST
కేజ్రీవాల్‌కి తెగ నచ్చేసిన ఉల్లి వ్యాపారి వీడియో... కలవాలనుకుంటున్నానని ట్వీట్...
కేజ్రీవాల్ ట్వీట్ ఫొటో (credit - twitter - Arvind Kejriwal)
  • Share this:
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న CAA ఆందోళనలు యువతను బీజేపీకి దూరం చేసి... అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి దగ్గర చేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ కారణంగానే మరోసారి తామే అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్ ఫుల్లుగా కనిపిస్తోంది ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లో. ఐదేళ్ల పాలనలో ఏం చేసిందీ ప్రజలకు అత్యంత వివరంగా చెబుతున్న కేజ్రీవాల్... బీజేపీ లాగా తాము మత పరమైన చిచ్చులు పెట్టట్లేదంటూ కమలనాథులపై ఆరోపణలతో చెలరేగిపోతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. ఐదేళ్ల కిందట కేజ్రీవాల్ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి రావడానికి... అక్కడి చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగులు, యువత ప్రధాన కారణం అయ్యారు. ఐతే... అప్పట్లో పేదవాళ్లకు ఆ పార్టీ పెద్దగా తెలియదు. ఇప్పుడైతే... ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఆప్‌ని గుర్తిస్తున్నారు. ఆ పార్టీ పేరులోనే సామాన్యుల పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ) అని ఉన్నట్లుగానే... ఇప్పుడు సామాన్యులు కూడా ఆప్‌ని గుర్తిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల వరకూ చూస్తే... ఆప్‌కే ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కింది వీడియో. ఓ ఉల్లిపాయల వ్యాపారి కేజీ రూ.40కి ఉల్లిపాయల్ని అమ్ముతున్నాడు. అందులో పనిచేస్తున్న కుర్రాడు... వచ్చిన కస్టమర్లకు పాలిథిన్ క్యారీబ్యాగ్స్ ఇస్తూ... కేజీ రూ.40కే ఉల్లిపాయల్ని ఇస్తున్నట్లు అరుస్తూ... మధ్యమధ్యలో జై కేజ్రీవాల్, ఆప్ కీ బార్ కేజ్రీవాల్ సర్కార్ అనే నినాదాలు చేస్తున్నాడు. చూస్తే... అతను ఆప్ కార్యకర్తగానీ, ఆప్ నేతలతో అతని సంబంధాలు ఉన్నట్లు గానీ కనిపించట్లేదు. ఓ సామాన్య వ్యక్తి... ఇలా కేజ్రీవాల్ సర్కార్‌ను మెచ్చుకుంటూ గట్టిగా ప్రచారం చేస్తుండటం విశేషం. అందుకే ఈ వీడియో కేజ్రీవాల్‌ని ఆకర్షించింది. ఎవరో తనకు ఈ వీడియో పంపారన్న కేజ్రీవాల్... ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయన్నారు. ఆ కుర్రాణ్ని కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ వీడియో మీరూ చూడండి.

ఇదీ విషయం. ఇలాంటి అంసాలు ఆప్ సర్కారులో కాన్ఫిడెన్స్ పెంచుతున్నాయి. ఇటీవలే ‘లగే రహో కేజ్రీవాల్’ పాటను కూడా రిలీజ్ చేసి ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో పండగ చేసుకుంటోంది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లలో ఆప్... 67 స్థానాలు గెలుచుకుంది. మూడు స్థానాలు గెలుచుకున్న బీజేపీ... లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలుండగా... ఏడింటినీ గెలుచుకుంది. అందువల్ల ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కి గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. ఐతే... ఢిల్లీ ఓటర్లు... లోక్‌సభ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ సంబంధం లేకుండా తీర్పు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ పరిపాలన వరకూ కేజ్రీవాల్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 54.3 శాతం ఓట్లు గెలుచుకోగా... బీజేపీ 32.3 శాతం... కాంగ్రెస్ 9.7 శాతం ఓట్లు సాధించాయి.
First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు