Kejriwal-Anna Hazare : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 (Delhi Excise Police)అమలులో అక్రమాలు జరిగినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు మేరకు సీబీఐ(CBI)దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా(Manish Sisodia)సహా 15 మందిని నిందితులుగా చేర్చింది. ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే(Anna Hazare)మంగళవారం ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)కు ఓ లేఖ రాశారు..కేజ్రీవాల్ అధికార వ్యసనంలో మునిగిపోయారంటూ విమర్శలు గుప్పించారు. స్వరాజ్ పుస్తకంలో అనేక ఆదర్శ సూత్రాలను కేజ్రీవాల్ ప్రస్తావించారన్న హజారే.. అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారని విమర్శించారు. ఆప్ కూడా మిగతా పార్టీల దారిలోనే పయనించడం బాధ కలిగించే విషయమన్నారు.
"గొప్ప ఉద్యమం నుంచి పుట్టిన ఓ రాజకీయ పార్టీకి ఇది తగినది కాదు. డబ్బు ద్వారా అధికారం, అధికారం ద్వారా డబ్బు విష చక్రంలో ఇతర పార్టీల్లాగానే మీరుకూడా చిక్కుకున్నారు. మద్యం వినియోగాన్ని పెంచే విధంగా, ప్రతి వీథిలోనూ మద్యం దుకాణాలను తెరిచే విధంగానూ మీరు మద్యం విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానం ప్రజా ప్రయోజనాల కోసం కాదు. ఇది అవినీతికి దారి తీసే పథకం. ప్రజల జీవితాన్ని నాశనం చేయడంతో పాటు మహిళలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదముంది. మద్యం మనిషిని మత్తులో ముంచుతుంది. అదేవిధంగా అధికారం అనే మత్తు కూడా ఉంది. అధికారం అనే మత్తులో మీరు మునిగిపోయినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగినట్లు తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను"అని కేజ్రీవాల్ కు రాసిన లేఖలో అన్నా హజారే పేర్కొన్నారు.
పవిత్రమైన గంగా నదిలో హుక్కా కొడుతూ.. చికెన్ వండుకుంటూ.. వీడియో వైరల్..
కాగా,కేజ్రీవాల్,అన్నాహజారే ఒకప్పుడు కలిసికట్టుగా అవినీతిపై పోరాడినవారే, లోక్పాల్ వ్యవస్థను తీసుకురావాలని ఉద్యమించినవారేనన్న విషయం తెలిసిందే. అన్నా హజారే బహిరంగ లేఖ రాయటంపై కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ గురిపెడుతోందన్నారు. కేజ్రీవాల్ విలేకర్లతో మాట్లాడుతూ..ఓ వ్యక్తిని ఉపయోగించుకుని దాడి చేయడం రాజకీయాల్లో సహజమేనన్నారు. మద్యం విధానంలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, అయితే సీబీఐ మాత్రం కుంభకోణం జరగలేదని చెప్తోందని అన్నారు. బీజేపీ చెప్పే మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. అందుకే తాజాగా అన్నా హజారే భుజాలపై తుపాకీ పెట్టి.. తమపై గురి పెడుతున్నారని విమర్శించారు..తాము ప్రజాక్షేత్రంలోకి వచ్చినపుడే లాంటి విచారణలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే వస్తామన్నారు. సీబీఐ మనీశ్ సిసోడియాను 14 గంటల పాటు విచారించిందని..వారడిగిన అన్ని ప్రశ్నలకు సిసోడియా సమాధానం ఇచ్చారని తెలిపారు. ఆయన లాకర్లో ఏం లభించలేదని సీబీఐ అనధికారంగా క్లీన్ చిట్ ఇచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aravind Kejriwal, CBI, Delhi