గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ పార్టీ సీఎం అభ్యర్థి పేరు ఖరారు అయింది. తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా ఇసుధన్ గద్వి పేరును ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Cm Kejriwal) ప్రకటించారు. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ (Cm Kejriwal) ట్విట్టర్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. నేను మీ కుటుంబంలో సభ్యుడిని, మీ సోదరుడిని. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మీకు పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తాను. మీకు ఉచిత విద్యుత్ అందిస్తాను. మిమ్మల్ని అయోధ్యలోని రామాలయానికి తీసుకెళ్తానని కేజ్రీవాల్ (Cm Kejriwal) పేర్కొన్నారు. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
Isudan Gadhvi, National Joint General Secretary of Aam Aadmi Party (AAP), announced as the party's CM candidate for the upcoming #GujaratElections2022 pic.twitter.com/GYWoZjbXJ8
— ANI (@ANI) November 4, 2022
- మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. తొలి దశ ఎన్నికలకు నవంబరు 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న తొలి దశ పోలింగ్ ఉంటుంది.
- గుజరాత్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ , కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీ ఇచ్చింది. మేం కూడా పోటీల్లో ఉన్నామంటూ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ , కాంగ్రెస్ , ఆమాద్మీ మధ్య ముక్కోణపు పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్కు 77 సీట్లు వచ్చాయి. మరి ఈసారి జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.