హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మంచు దుప్పటిలో కేదార్ నాథ్...తాత్కాలికంగా ఆలయం మూసివేత...

మంచు దుప్పటిలో కేదార్ నాథ్...తాత్కాలికంగా ఆలయం మూసివేత...

మంచులో కేదార్ నాథ్ (Image:ANI)

మంచులో కేదార్ నాథ్ (Image:ANI)

సాధారణంగా ఈ ఆలయాన్ని 6 నెలలు మూసివేసి, మరో 6 నెలలు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో ప్రతిష్టాత్మకమైన ఈ శైవ క్షేత్రాన్ని మూసివేశారు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను తాత్కాలికంగా మూసేశారు. మంచు కప్పేయడంతో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో మంచు కప్పేసింది. భారీగా మంచు కురియనున్న నేపథ్యంలో ఇప్పటికే కేదార్‌నాథ్‌లోని చార్‌ధామ్‌గా పిలిచే బద్రినాథ్‌, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తాత్కాలికంగా మూసేశారు. ఎముకలు కొరికే చలి ఉండడంతో భక్తులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఈ ఆలయాన్ని 6 నెలలు మూసివేసి, మరో 6 నెలలు భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో ప్రతిష్టాత్మకమైన ఈ శైవ క్షేత్రాన్ని మూసివేశారు. భక్తులు రాక పోకలకు అసౌకర్యం కలగుతుందనే ఉద్దేశంతోనే ఈ ఆలయాన్ని 6 నెలల కాలం పాటు మూసేస్తారని ఆలయకమిటీ తెలిపింది. మళ్లీ ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకున్న భక్తులు ఆరు నెలల కాలం పాటు ఆగాల్సిందే.

First published:

Tags: Kedarnath, National