హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Helicopter crash: కుప్పకూలిన కేదార్‌నాథ్ యాత్రికుల్ని తీసుకెళ్తున్న హెలికాప్టర్ .. ప్రమాదంలో ఆరుగురు మృతి

Helicopter crash: కుప్పకూలిన కేదార్‌నాథ్ యాత్రికుల్ని తీసుకెళ్తున్న హెలికాప్టర్ .. ప్రమాదంలో ఆరుగురు మృతి

helicopter crash

helicopter crash

Helicopter crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో నలుగురు యాత్రికులు ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్‌కు (Kedarnath)యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు(Helicopter crash) లోయలో పడింది. ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్(NDRF) సహాయక బృందాలు ఘటన స్తలానికి చేరుకున్నాయి. సహాయకచర్యలను కొనసాగిస్తున్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగింది..? చనిపోయిన వాళ్ల వివరాలు ఏంటీ అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Big News: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ నియామకం..అధికారిక ప్రకటన

బ్యాడ్ వెదర్ ..

వాతావరణం అనుకూలంగా లేని కారణంగానే కేదార్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు మృతదేహాలను అధికారులు రికవరీ చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.

గరుడచట్టి సమీపంలో ఘటన..

కేదార్‌నాథ్ ధామ్‌లో హెలికాప్టర్ కూలిపోయిన ప్రమాదం ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. గరుడచట్టి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆర్యన్ హెలీ కంపెనీకి చెందినదని అధికారులు చెబుతున్నారు.

Viral video: ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ .. ఏ రేంజ్‌లో జరిగిందో ఈవీడియో చూడండి

ముక్కలైన హెలికాప్టర్..

ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు కూర్చున్నారు. దట్టమైన పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. ప్రమాదంలో ముక్కలైన హెలికాప్టర్ శకలాలతో ఘటన స్తలం భీతిల్లిపోయింది. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిజానికి కేదార్‌నాథ్ ధామ్‌లో పొగమంచు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈతరహా ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి.

First published:

Tags: Helicopter Crash, International news, Uttarakhand

ఉత్తమ కథలు