హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kedarnath: కేదార్‌నాథ్‌లో శివలింగం ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా? ఈ ఆలయ ప్రత్యేకత ఇదే

Kedarnath: కేదార్‌నాథ్‌లో శివలింగం ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా? ఈ ఆలయ ప్రత్యేకత ఇదే

కేదార్‌నాథ్ ఆలయం

కేదార్‌నాథ్ ఆలయం

Kedarnath Temple: భీముడు వృషభరూపంలో శివుని దగ్గరికి వెళ్ళగానే.. వారికి దొరకకుండా ఉండేందుకు.. శివుడు మంచులోకి కూరుకుపోయాడట. ఇది చూసిన భీముడు.. మూపురం భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అక్కడ శిలగా ఉండిపోయింది.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

కేదార్‌నాథ్ ఆలయం (Kedarnath Temple).. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పదకొండవ జ్యోతిర్లింగం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని.. శివుడిని దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కేదార్‌నాథ్‌కి వెళ్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్‌ఘటిలో ఈ ఆలయం ఉంది.  కేదార్ ఆలయాన్ని పాండవ వంశస్థుడైన జనమేజయుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఉన్న స్వయంభూ శివలింగం చాలా పురాతనమైనది. ఆది గురు శంకరాచార్య ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని కత్యూరి శైలిలో నిర్మించారు.  రాళ్లు, దేవదారు చెక్కపై అందమైన శిల్పాలు కనిపిస్తాయి.

Shani Dev | Astrology: మరో మూడు రోజులు.. ఈ రాశుల వారికి అంతులేని సంపద..

పౌరాణిక విశ్వాసాల ప్రకారం.. మహాభారత యుద్ధంలో గెలిచిన తరువాత పాండవులు శివుడిని దర్శించుకునేందుకు వెళ్తారు. తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుడిని వెతుకుతూ కేదారఘాటి వైపు పయనిస్తారు. యుద్ధంలో ఎంతో మందిని చంపిన పాండవులను దోషులుగా భావించి.. వారిని కలవడానికి శివుడు ఇష్టపడలేదట. పాండవులు ఇక్కడకు చేరుకున్నప్పుడు.. శివుడు ఎద్దులా మారి పశువుల మందలో కలిసిపోయాడట. పశువుల మందలో భోలే శంకర్ ఉన్నాడని ఆకాశవాని ద్వారా పాండవులు తెలుసుకుంటారు. భీముడు శివుడిని వెతకడానికి రెండు పర్వతాల మధ్య కాళ్లు చాచి నిలబడతాడు. అప్పుడు పశువులన్నీ భీముని పాదాల కింది నుంచి  వెళ్లిపోయాయి. వారిని చూసేందుకు ఇష్టపడని శివుడు.. ముందుకు వెళ్లకుండా.. వెనక్కి తిరిగి నిలబడ్డాడు.

Maha Shivaratri 2023: శివరాత్రి ఉపవాసం ఉన్నప్పుడు ఈ పనులు అస్సలు చేయకూడదు

భీముడు వృషభరూపంలో శివుని దగ్గరికి వెళ్ళగానే.. వారికి దొరకకుండా ఉండేందుకు.. శివుడు మంచులోకి కూరుకుపోయాడట. ఇది చూసిన భీముడు.. మూపురం భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అది అక్కడ శిలగా ఉండిపోయింది. ఆ భాగాన్నే ఇప్పుడు కేదార్‌నాథ్‌లో పూజిస్తారు. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండు (నేపాల్‌)లో ఉంటుంది. అందుకే చాలా మంది కేదార్ నాథ్‌లో దర్శనం తర్వాత.. నేపాల్ వెళ్లి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు.

సత్యయుగంలో నారాయణ ఋషి ఇక్కడ శంకర్ భగవంతుని కోసం తపస్సు చేశారని.. శివుడు జ్యోతిర్లింగ రూపంలో కేదార్ ధామ్‌లో దర్శనమిచ్చాడని కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారి శివశంకర్ తెలిపారు. బాబా కేదార్‌ను దర్శించిన భక్తుల రోగాలు, దోషాలు, పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పారు. శీతాకాలంలో చలి, మంచు కారణంగా ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో బాబా కేదార్‌ను ఉఖిమత్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో పూజిస్తారు. కేదార్‌నాథ్ యాత్ర.. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది. హరిద్వార్‌కు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది. హరిద్వార్‌ వరకు రైలులో చేరుకొని.. అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా కేదార్‌నాథ్‌కు చేరుకోవచ్చు.

First published:

Tags: Kedarnath, Uttarakhand

ఉత్తమ కథలు