ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) ఇకలేరు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబీకులు సోమవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన అసలు పేరు పండిట్ బ్రిజ్మోహన్ మిశ్రా. కథక్ డ్యాన్సర్‌గానే కాకుండా శాస్త్రీయ గాయకుడు కూడా ఆయన.. దీనితో పాటు, అతను సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్ కూడా అందుకున్నాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం , ఖైరాగఢ్ విశ్వవిద్యాలయాలు కూడా బిర్జు మహారాజ్‌కు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.
లక్నోలోని కథక్ కుటుంబంలో జన్మించిన బిర్జూ మహారాజ్ తండ్రి పేరు అచ్చన్ మహారాజ్, అతని మేనమామ పేరు శంభు మహారాజ్. దేశంలోని ప్రసిద్ధ కళాకారులలో ఇద్దరి కూడా ప్రముఖులు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యత బిర్జూ మహారాజ్ భుజస్కంధాలపై పడింది. అయినప్పటికీ, అతను తన మామ నుంచి కథక్ నృత్య శిక్షణ తీసుకోని.. జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు.
దేవదాస్ , దేద్ ఇష్కియా , ఉమ్రావ్ జాన్ , బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు. ఇది కాకుండా సత్యజిత్ రే చిత్రం ‘ చెస్ కే ఖిలాడీ’కి కూడా సంగీతం అందించారు. విశ్వరూపం చిత్రంలో ఆయన నృత్యానికి 2012 లో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. 2016 సంవత్సరంలో బాజీరావ్ మస్తానీ రాసిన ‘ మోహే రంగ్ దో లాల్ ‘ పాటకు కొరియోగ్రఫీకి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
పండిట్ బిర్జూ మహారాజ్ మరణంపై సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ‘గొప్ప కథక్ నృత్యకారుడు పండిట్ బిర్జు మహారాజ్ జీ మరణవార్త చాలా బాధగా ఉంది. ఈ రోజు మనం కళారంగంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కోల్పోయాం. తన ప్రతిభతో తరాలను ప్రభావితం చేశారు’అని గాయకుడు అద్నాన్ సమీ ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Classical dancer, Legend, Uttar pradesh