ఉగ్రవాదిగా మారిన హైదర్ సినిమా హీరో, ఎన్‌కౌంటర్‌లో హతం

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో  ఈరోజు భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు గతంలో బాలీవుడ్‌ సినిమాలో నటించడం విశేషం.

news18-telugu
Updated: December 14, 2018, 2:21 AM IST
ఉగ్రవాదిగా మారిన హైదర్ సినిమా హీరో, ఎన్‌కౌంటర్‌లో హతం
.
  • Share this:
జమ్ముకశ్మీర్‌ రాష్ట్రంలో  ఈరోజు భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు గతంలో బాలీవుడ్‌ సినిమాలో నటించడం విశేషం. 2014లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా‘హైదర్’లో నటించాడు.  ఈ సినిమాలో షాహిద్ కపూర్ చిన్ననాటి పాత్రలో నటించాడు,  హతుడు బిలాల్.

వివరాల్లోకి వెలితే.. రాష్ట్రంలోని బాండీపొరాలోని సోపోర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా దళాలకు పక్కా సమాచారం అందింది. భద్రతా దళాలు బుధవారం రాత్రి ఉగ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టుముట్టాయి . దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు 17 ఏళ్ల షకీబ్ బిలాల్ అహ్మద్ కాగా, మరొకరు ముదసిర్ అహ్మద్ అనే 14 ఏళ్ల బాల ఉగ్రవాది.
Published by: Suresh Rachamalla
First published: December 13, 2018, 11:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading