హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kashmir: కశ్మీర్‌పై పుకార్లు...నకిలీ అకౌంట్లను తొలగించిన ట్విట్టర్

Kashmir: కశ్మీర్‌పై పుకార్లు...నకిలీ అకౌంట్లను తొలగించిన ట్విట్టర్

శ్రీనగర్‌లో బందోబస్తు విధుల్లో ఓ జవాను

శ్రీనగర్‌లో బందోబస్తు విధుల్లో ఓ జవాను

Jammu and Kashmir News | ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పుకార్లు సృష్టిస్తున్న వివాదాస్పద ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని కేంద్ర హోం శాఖ ట్విట్టర్‌ను కోరింది.

జమ్ముకశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై కొందరు సోషల్ మీడియా వేదికగా పుకా‌ర్లు సృష్టిస్తున్నారు. కశ్మీర్‌ లోయలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, పలువురు మృతి చెందారంటూ నకిలీ ట్విట్ఱర్ ఖాతాల్లో వరుస పోస్టులు చేస్తున్నారు. కశ్మీర్‌లో నెలకొన్న ప్రశాంతతను పాడుచేసే లక్ష్యంతో కొందరు వేర్పాటువాదులు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. కశ్మీర్‌లో నెలకొంటున్న పరిస్థితులపై పుకార్లు సృష్టించే ఖాతాలను నియంత్రించడంలో ట్విట్టర్ సంస్థ విఫలమవుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వేర్పాటువాదులకు ట్విట్టర్ సహకరిస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో కశ్మీర్‌‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అవాస్తవ సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని హోం శాఖ సోమవారం ట్విట్ఱర్‌ను కోరింది. సదరు నకిలీ ట్విట్టర్ ఖాతాల వివరాలు కూడా ఇచ్చింది.  ఈ నేపథ్యంలో నాలుగు ఖాతాలను ట్విట్టర్ తొలగించగా...మరో నాలుగు ఖాతాలను పరిశీలిస్తోంది. ప్రధానంగా ఈ ఎనిమిది ఖాతాలను తొలగించాలని ట్విట్టర్‌ను కేంద్ర హోం శాఖ కోరినట్లు తెలుస్తోంది. వీటిలో వేర్పాటువాద నేత సయ్యిద్ అలీ జిలానీ ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది.

జమ్ముకశ్మీర్ పోలీసులు‌కి చెందిన ఐదుగురు జవాన్లను కాల్చిచంపారంటూ కొన్ని ట్విట్టర్ అకౌంట్స్‌లో కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ కథనాలను జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వివాదాస్పద ట్విట్టర్ అకౌంట్స్‌ను తక్షణమే తొలగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ట్విట్టర్‌ను కోరారు.

First published:

Tags: Article 370, Jammu and Kashmir, Jammu and kashmir bifurcation, Kashmir security, Twitter

ఉత్తమ కథలు