హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్...భారీ కుట్ర భగ్నం...

కాశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్...భారీ కుట్ర భగ్నం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బుద్గాంలోని నర్బల్ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ లో 5గురు ఉగ్రవాద అనుచరులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల్ని ఇమ్రాన్ రషీద్, ఇఫ్షాన్ అహ్మద్ ఘనీ, ఒవైస్ అహ్మద్, మోసిన్ ఖాదీర్, అబీద్ రాదర్‌గా గుర్తించారు.

  కాశ్మీర్లో ఉగ్రవాదులకు సైనికులు దీటైన సమాధానం ఇచచారు. గురువారం తెల్లవారుజామునే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళితే కాశ్మీర్ లోని సోపోర్ జిల్లాలోని హర్డ్‌శివ ప్రాంతంలో ఉగ్రవాదులు బస చేస్తున్నారని సమాచారం అందుకున్న భద్రతా దళాలు ( సీఆర్పీఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసు బలగాలు) ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహించారు. దీంతో భద్రతా దళాల జాడ గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఒక బృందంగా ఉన్నట్లు గుర్తించారు.

  అటు బుద్గాంలోని నర్బల్ ప్రాంతంలో భద్రతా దళాల కూంబింగ్ లో 5గురు ఉగ్రవాద అనుచరులను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల్ని ఇమ్రాన్ రషీద్, ఇఫ్షాన్ అహ్మద్ ఘనీ, ఒవైస్ అహ్మద్, మోసిన్ ఖాదీర్, అబీద్ రాదర్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి 28 రౌండ్ల బుల్లెట్లు, ఏకే47, ఒక మ్యాగజైన్, మరికొంత మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మరో భారీ దాడులకు కుట్ర పన్నుతున్నట్టు భారత ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద ఎత్తున లష్కరే – జైషే మహ్మద్ ఉగ్రవాదుల బృందం పీవోకే ద్వారా కశ్మీర్ లోకి ప్రవేశించి భారీ దాడులకు ప్లాన్ చేసిందని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలకు భారీగా మందుగుండు సామగ్రి – బాంబులు – నిధులను పీవోకేలో సమకూర్చిందని ఉగ్రవాదులు భారత్ లో పెట్రేగిపోవడానికి సర్వంసన్నద్ధమయ్యారని.. అలెర్ట్ గా ఉండాలని ఐబీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేంద్రం భారత సైన్యాన్ని అలెర్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

  Published by:Krishna Adithya
  First published:

  Tags: Jammu and Kashmir, Kashmir Issue

  ఉత్తమ కథలు