Home /News /national /

KASHMIR CONTROVERSY HONDA AND DOMINOS SAY SORRY FOR THE MISTAKE KASHMIR EVK

Kashmir Controversy: "పొర‌పాటైంది క్ష‌మించండి.." మ‌రో బ‌డా రెండు బ‌డా కంపెనీల‌కు క‌శ్మీర్ సెగ‌!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Kashmir Controversy | ప్రముఖ ఆటోమొబైల్ (Automobile) కంపెనీ హ్యుందాయ్, కేఎఫ్‌సీ పాకిస్థాన్‌కు మద్దతుగా తన సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేయడం వివాదానికి తెర‌లేచింది. ఈ వివాదంలో మ‌రో రెండు కంపెనీలు త‌మ త‌ప్పును గుర్తించి క్ష‌మాప‌ణ‌లు చెప్పాయి.

ఇంకా చదవండి ...
    ప్రముఖ ఆటోమొబైల్ (Automobile) కంపెనీ హ్యుందాయ్, కేఎఫ్‌సీ పాకిస్థాన్‌కు మద్దతుగా తన సోషల్ మీడియా సైట్‌లో పోస్ట్ చేయడం వివాదానికి తెర‌లేచింది. ఈ కంపెనీలు ఫిబ్రవరి 5న కాశ్మీర్ (Kashmir) దినోత్సవంగా జరుపుకునే విషయాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.పోస్ట్ వైరల్ అయిన వెంటనే #BoycottKFC, #BoycottHyundai అంటూ ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అయ్యింది. దీంతో హ్యుండాయ్ కంపెనీ త‌ర‌ఫున ద‌క్షిణ కొరియా మంత్రి భార‌త విదేశాంగ మంత్రితో మాట్లాడి స‌మ‌స్య స‌ద్దుబాటుకు చ‌ర్య‌ల‌తు తీసుకొన్నారు. అయితే ఈ వివాదంలో తాజాగా మ‌రో రెండు కంపెనీలు వెలుగులోకి చ్చాయి. ప్ర‌ముఖ పిజ్జా కంపెనీ డొమినోస్‌, ఆటోమొబైల్ కంపెనీ హోండా కూడా కశ్మీర్ అంశంలో ట్వీట్ చేసినందుకు ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతో క్ష‌మించ‌మ‌ని మ‌రో ట్వీట్ చేశారు.

    Assembly Election 2022: మ‌మ్మ‌ళ్ని గెలిపించండి.. మూడేళ్లు పెట్రోల్ ధ‌ర‌లు పెంచం!



    "భారత్లో 25 ఏళ్లుగా ఉన్నాం . ఇక్క డి ప్రజలు, వారి సం స్కృ తి, జాతీయతా స్ఫూ ర్తిపై మాకు అమితమైన గౌరవం ఉం ది. దేశ ఔన్న త్యా న్ని మేం గౌరవిస్తున్నాం . దేశం వెలుపలి నుం చి డోమినోస్ సామాజిక మాధ్యమ వేదికలపై దర్శనమిచ్చిన అనుచిత సం దేశాలకు మేం క్షమాపణలు కోరుతున్నాం." అంటూ ట్వీట్ సంస్థ ట్వీట్ చేసింది.

    KFC India Apologize: కాశ్మీర్ విష‌యంలో మ‌రో ప్ర‌ముఖ కంపెనీకి సెగ‌.. పోస్ట్ డెలిట్‌!



    హ్యుందాయ్ (Hyundai) క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ట్విట్ట‌ర్‌లో ప్ర‌జ‌ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ద‌క్షిణ కొరియా విదేశాంగ మంత్రి రంగంలోకి దిగారు. కాశ్మీర్‌పై సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజలకు మరియు భారత ప్రభుత్వానికి జరిగిన త‌ప్పుపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు-యోంగ్ బుధవారం తన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు పశ్చాత్తాపాన్ని తెలియజేశారు. దీనిపై మంత్రి జైశంక‌ర్ స్పందించారు.

    Hyundai: క‌శ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తుగా హ్యుందాయ్ పోస్ట్.. ప్ర‌జ‌ల ఆగ్ర‌హంతో దిద్దుబాటు చ‌ర్య‌లు!

    “రిపబ్లిక్ ఆఫ్ కొరియా విదేశాంగ మంత్రి హెచ్‌ఇ చుంగ్ ఇయు-యోంగ్ ఈ ఉదయం విదేశీ వ్యవహారాల మంత్రికి ఫోన్ చేశారు. వారు అనేక అంశాలపై చర్చించినప్పుడు, సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రజలకు మరియు భారత ప్రభుత్వానికి జరిగిన నేరానికి వారు చింతిస్తున్నట్లు RoK విదేశాంగ మంత్రి కూడా తెలియజేశారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Honda, Hyundai, Jammu and Kashmir, Twitter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు