తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)ను వారి చేతుల్లోకి తీసుకన్న తర్వాత సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో కొన్ని నిజమైనవి కాగా, మరికొన్ని కల్పితమైనవి ఉన్నాయి. అయితే చాలా అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం ఏది నిజమైనదో, ఏది అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా జమ్ముకశ్మీర్‌కు చెందిన 60 మంది యువకులు(kashmir youth) కనిపించకుండా పోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే వీరు తాలిబన్లను కలిశారనే కోణంలో ప్రచారం సాగుతోంది. తాజాగా వాటిని కశ్మీర్ పోలీసులు స్పందించారు.
కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది యువకులు కనిపించకుండా వెళ్లిపోయారని కొన్ని సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్స్‌లో ప్రచారం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరిగిందని పోస్టుల్లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా అవాస్తవం’కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ మేరకు ANI వార్త సంస్థ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది.
KRMB Meeting: కేఆర్‌ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్.. ఏం జరిగిందంటే..
ఇక, మంగళవారం భారత ఆర్మీ(Indian Army) టాప్ కమాండర్ ఒకరు కశ్మీర్ లోయలో.. జమ్మూ కశ్మీర్‌లోని వివిధ ఉగ్రవాద గ్రూప్‌ల్లో చేరిన పిల్లలకు సంబంధించిన 80 కుటుంబాలను కలిశారు. వారి పిల్లలకు ఏదో ఒక విధంగా ఉగ్రమూకల నుంచి తిరిగి వెనక్కి తీసుకురావాలని కోరారు. దారి తప్పి ఉగ్రమూకలలో చేరుతున్న యువకులను తిరిగి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని భద్రతా దళాలు నిత్యం కోరుతూనే ఉన్నాయి. హింస మార్గానికి దూరంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు కూడా నెలకొన్నాయి. అయితే కశ్మీర్ లోయలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ తెలిపింది.
Shocking: ఆనందంగా సాగుతున్న జీవితంలో ఊహించని మలుపు.. పాపం ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకుని ఉండరు..
Kashmir Police refutes reports claiming that 60 youths have gone missing from different parts of Kashmir valley amid Taliban takeover of Afghanistan pic.twitter.com/XcP1DUuxJh
— ANI (@ANI) September 1, 2021
ఇక, సోమవారం ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిస్థాయిలో వెనుతిరిగాయి. కొన్ని నెలలుగా ఆఫ్గానిస్థాన్ నుంచి తమ సేనలను, అక్కడ తమకు ఆశ్రయం ఇచ్చిన కొందరు ఆప్ఘన్ పౌరులను అమెరికా (United States)తరలిస్తున్న అగ్రరాజ్యం.. సోమవారం ఆ పనిని పూర్తి చేసినట్టు ప్రకటించింది. సోమవారం కాబూల్(Kabul) నుంచి చివరి విమానం బయలుదేరినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ ఫ్రాంక్ మెకెంజీ తెలిపారు. అమెరికా బలగాలు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగడంతో తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Indian Army, Jammu and Kashmir, Taliban