వారణాసి (Varanasi) లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం డిసెంబర్ 13, 2021న ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. ప్రపంచ పురాతన నగరాల్లో ఒక్కటైన వారణాసిలో పర్యాటక రంగాన్ని మెరుగుపరుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కాశీ విశ్వనాథ్ కారిడార్ (Kashi Vishwanath corridor) ను ప్రారంభించిన తర్వాత, నది క్రూయిజ్‌లో పలువురు ముఖ్యమంత్రులతో మోదీ అనధికారిక సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం వారణాసి ఘాట్లలో గంగా 'ఆరతి' మరియు గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారని ఒక ఉన్నత అధికారి ఆదివారం తెలిపారు. ఐకానిక్ దశాశ్వమేధ ఘాట్ సమీపంలోని చారిత్రాత్మక కాశీ విశ్వనాథ దేవాలయం చుట్టూ అత్యాధునిక మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవం ఉంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న వేళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది.
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రత్యేకతలు..
- ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 23 భవనాలను ప్రారంభించనున్నారు. యాత్రికుల కోసం యాత్రికులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తారు, వాటిలో ‘యాత్రి సువిధ కేంద్రాలు’, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, సిటీ మ్యూజియం (City Museum) , వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ తదితరాలు ఉంటాయి.
- ఈ ప్రాజెక్ట్‌లో ఆలయం చుట్టూ ఉన్న 300 కంటే ఎక్కువ ఆస్తులను కొనుగోలు చేశారు.
Rajnath Singh: మత ప్రాతిపదికన దేశ విభజన "చారిత్రక తప్పిదం": రాజ్‌నాథ్ సింగ్
- ప్రాజెక్ట్ యొక్క స్థాయి ఇప్పుడు దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది, ఇంతకుముందు ప్రాంగణాలు కేవలం 3,000 చదరపు అడుగులే ఉండేది. కోవిడ్ (Covid 19) మహమ్మారి ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యాయని PMO పేర్కొంది.
- ఆలయం యొక్క ప్రస్తుత నిర్మాణాన్ని 1780లో మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ దీనిని బంగారు 'శిఖర్'తో పట్టాభిషేకం చేశారు.
- కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ వెబ్సైట్ ప్రకారం, ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాన్ని 'గోల్డెన్ టెంపుల్' అని కూడా పిలుస్తారు. చాలా పాత మ్యాప్‌లలో, ఈ పేరు ప్రస్తావించబడిందని చూడవచ్చు.
Rahul Gandhi: నేను హిందువుని, హిందువాదిని కాదు: జైపూర్ ర్యాలీలో రాహుల్ గాంధీ
- 2014 నుంచి మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన నగరం, మెగా ఈవెంట్‌కు సిద్ధమైంది. ‘దివ్య కాశీ, భవ్య కాశీ’ , టెంపుల్ టౌన్ వాసులు ప్రధాని రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ కార్యక్రమ ప్రసారానికి డిడి ప్రత్యేక ఏర్పాట్లు..
- ఈ నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవాన్ని కవర్ చేయడానికి దూరదర్శన్ (డీడీ) 200పైగా సిబ్బందిని నియమించింది.
- ప్రభుత్వ వర్గాల ప్రకారం, డిసెంబర్ 13న డిడి న్యూస్, డీడీ ఇండియా కార్యక్రమాలలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు తరువాత సాయంత్రం 5 నుండి రాత్రి 8.45 వరకు ప్రధానమంత్రి కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి.
- కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ ప్రారంభోత్సవం డిడి నేషనల్ మరియు ప్రాంతీయ భాషా శాటిలైట్ స్టేషన్లు (Regional Language Satellite Stations) ఛానెల్‌లలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Most Expensive Book: ఆ పుస్తకం ధర రూ.3,56,62,942.. ఏమిటీ ప్రత్యేకత.. ఎందుకంత ఖరీదు!
- ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ ధామ్ సందర్శన ప్రత్యక్ష ప్రసారానికి డీడీ విస్తృతంగా సన్నాహాలు చేసింది. డిసెంబర్ 13, 2021న జరిగే ఈ కార్యక్రమాన్ని 55 కెమెరాలు, ఏడు శాటిలైట్ అప్‌లింక్ వ్యాన్లు, జిమ్మీ జిబ్లతో పాటు సరికొత్త డ్రోన్లు, రేడియో ఫ్రీక్వెన్సీ కెమెరాలతో కవర్ చేయనున్నట్టు ప్రరసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి ట్వీట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pm modi, PM Narendra Modi, Uttar pradesh, Varanasi