కర్తార్‌పూర్‌ కారిడార్... గురుద్వారాలో మోదీ పూజలు

Kartarpur Sahib Corridor : పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ వెళ్లేందుకు ఇవాళ్టి నుంచీ వీలవుతుంది. ఇందుకు సంబంధించిన కారిడార్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

news18-telugu
Updated: November 9, 2019, 9:58 AM IST
కర్తార్‌పూర్‌ కారిడార్... గురుద్వారాలో మోదీ పూజలు
కర్తార్‌పూర్‌ కారిడార్... గురుద్వారాలో మోదీ పూజలు (credit - twitter - ani)
  • Share this:
Kartarpur Sahib Corridor : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... పంజాబ్... లోధీలోని... బెర్ సాహిబ్ గురుద్వారాలో పూజలు చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభానికి ముందు ఆయన పూజల్లో పాల్గొన్నారు. కర్తార్‌పూర్ సాహిబ్‌కు ఇవాళ్టి నుంచీ యాత్రికులు వెళ్లేందుకు వీలవ్వనుంది. ముందుగా వెళ్లే యాత్రికుల బృందంలో... మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఉన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ అనేది 4.5 కిలోమీటర్ల పొడవైన కారిడార్. ఇండియాలోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉండే గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మించారు. ఇందుకు సంబంధించి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. రెండు దేశాల ప్రతినిధులూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. పాకిస్థాన్ వైపు నుంచీ అక్కడి ప్రధాని ఇమ్రాన్ ఖాన్... కర్తార్ పూర్ కారిడార్‌ను ప్రారంభిస్తున్నారు.


అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల అవతల ఆ గురుద్వారా ఉంది. ఇండియా నుంచీ వెళ్లేవారికి వీసాతో పనిలేకుండా గురుద్వారాకు అనుమతిస్తున్నారు. ఐతే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఈ యాత్ర విషయంలో పాకిస్థాన్‌ రూ.1400 ($20) సర్వీస్ ఛార్జి తీసుకుంటోంది.


సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో 18 ఏళ్లు గడిపారు. రావి నదీ తీరాన గురద్వార కర్తార్‌పూర్ ఉంది. విదేశాల్లో ఉండే ఎన్నారైలు కూడా గురుద్వార దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చని హోంశాఖ తెలిపింది. రోజుకు 5000 మంది భక్తులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శిస్తారని అంచనా. ఏడాది మొత్తం యాత్ర కొనసాగించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. వారం మొత్తం యాత్రకు అనుమతి ఉంది. సెలవు దినాలేవీ లేవు.

కర్తార్‌పూర్ యాత్ర ఎలా చెయ్యాలి? :
* కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో పేరు, వివరాలు రిజిస్టర్ చేయించుకోవాలి.
* రిజిస్టర్ కోసం https://prakashpurb550.mha.gov.in/kpr సైట్‌లోకి వెళ్లాలి.
* https://prakashpurb550.mha.gov.in/kpr/basicDetailsa లో వివరాలు ఇవ్వాలి.
* యాత్రకు వెళ్లే 4 రోజుల ముందే బుక్ చేసుకుంటే యాత్ర సాఫీగా సాగుతుంది.
* భక్తులను కర్తార్‌పూర్ సాహిబ్‌కే అనుమతిస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్లనివ్వరు.
* ఈ యాత్రకు వెళ్లే భక్తులు మాగ్జిమం రూ.11000 మాత్రమే తీసుకెళ్లాలని రూల్ ఉంది.
* ఒక్కో యాత్రికుడు/యాత్రికురాలు... 7 కేజీలకు మించి లగేజీని తీసుకెళ్లకూడదు.
* తాగే నీరు కూడా లగేజీలో భాగమే.
* యాత్రలో ఎక్కడా స్మోకింగ్ చెయ్యకూడదు.
* యాత్రలో ఫొటోలు, వీడియోలు తియ్యడానికి అనుమతి లేదు.
* యాత్ర కోసం పాలిథిన్ కవర్లు తీసుకెళ్లకూడదు. నార సంచులు, గుడ్డ సంచులు తీసుకెళ్లొచ్చు.
* ఉదయం కర్తార్‌పూర్‌కు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేలా ప్లాన్ వేసుకోవాలి.
Published by: Krishna Kumar N
First published: November 9, 2019, 9:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading