కర్తార్‌పూర్ అంటే ఏంటి? ఆ యాత్ర ఎలా చెయ్యాలి? కండీషన్లేంటి?

Kartarpur Corridor : ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట కర్తార్‌పూర్. పాకిస్థాన్‌తో భారత్‌కు సఖ్యత లేని సమయంలో... ఆ దేశంలోని కర్తార్‌పూర్‌ వెళ్లేందుకు మాత్రం రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం హర్షణీయం.

news18-telugu
Updated: October 25, 2019, 7:06 AM IST
కర్తార్‌పూర్ అంటే ఏంటి? ఆ యాత్ర ఎలా చెయ్యాలి? కండీషన్లేంటి?
కర్తార్‌పూర్ సాహిబ్
  • Share this:
Kartarpur Corridor : ఇండియాలోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురుద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉండే గురుద్వారా వరకు కారిడార్‌ను నిర్మించబోతున్నారు. ఇందుకు సంబంధించి భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. రెండు దేశాల ప్రతినిధులూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఐతే... ఇది చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. ఇండియాలో మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో... భారత్‌, పాకిస్థాన్‌ జీరోలైన్‌ దగ్గర ఒప్పందంపై సంతకాలు పెట్టే కార్యక్రమం నిర్వహించారు. భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్‌ గురు ద్వారా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా వరకు ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు 4 కిలోమీటర్ల అవతల ఆ గురుద్వారా ఉంది. ఇండియా నుంచీ వెళ్లేవారికి వీసాతో పనిలేకుండా గురుద్వారాకు అనుమతిస్తారు. ఐతే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. ఈ యాత్ర విషయంలో పాకిస్థాన్‌ రూ.1400 ($20) సర్వీస్ ఛార్జి తీసుకుంటోంది.

సిక్కుల ఆది గురువు శ్రీ గురునానక్ దేవ్ పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో 18 ఏళ్లు గడిపారు. రావి నదీ తీరాన గురద్వార కర్తార్‌పూర్ ఉంది. విదేశాల్లో ఉండే ఎన్నారైలు కూడా గురుద్వార దర్బార్ సాహిబ్‌ను దర్శించుకోవచ్చని హోంశాఖ తెలిపింది. రోజుకు 5000 మంది భక్తులు కర్తార్‌పూర్ సాహిబ్‌ను దర్శిస్తారని అంచనా. ఏడాది మొత్తం యాత్ర కొనసాగించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. వారం మొత్తం యాత్రకు అనుమతి ఉంది. సెలవు దినాలేవీ లేవు.

కర్తార్‌పూర్ సాహిబ్


కర్తార్‌పూర్ యాత్ర ఎలా చెయ్యాలి? :
* కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించాలనుకునేవారు ఆన్‌లైన్‌లో పేరు, వివరాలు రిజిస్టర్ చేయించుకోవాలి.
* రిజిస్టర్ కోసం https://prakashpurb550.mha.gov.in/kpr సైట్‌లోకి వెళ్లాలి.
* https://prakashpurb550.mha.gov.in/kpr/basicDetailsa లో వివరాలు ఇవ్వాలి.* యాత్రకు వెళ్లే 4 రోజుల ముందే బుక్ చేసుకుంటే యాత్ర సాఫీగా సాగుతుంది.
* భక్తులను కర్తార్‌పూర్ సాహిబ్‌కే అనుమతిస్తారు. ఇతర ప్రాంతాలకు వెళ్లనివ్వరు.
* ఈ యాత్రకు వెళ్లే భక్తులు మాగ్జిమం రూ.11000 మాత్రమే తీసుకెళ్లాలని రూల్ ఉంది.
* ఒక్కో యాత్రికుడు/యాత్రికురాలు... 7 కేజీలకు మించి లగేజీని తీసుకెళ్లకూడదు.
* తాగే నీరు కూడా లగేజీలో భాగమే.
* యాత్రలో ఎక్కడా స్మోకింగ్ చెయ్యకూడదు.
* యాత్రలో ఫొటోలు, వీడియోలు తియ్యడానికి అనుమతి లేదు.
* యాత్ర కోసం పాలిథిన్ కవర్లు తీసుకెళ్లకూడదు. నార సంచులు, గుడ్డ సంచులు తీసుకెళ్లొచ్చు.
* ఉదయం కర్తార్‌పూర్‌కు వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేలా ప్లాన్ వేసుకోవాలి.



Video : దివ్యాంగుల కోసం మేజిక్ ప్లానెట్


ఇవి కూడా చదవండి :

మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ భయపడ్డారా... వ్యూహాత్మకంగా వ్యవహరించారా?

Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?


Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: October 25, 2019, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading