ఇకపై ఫ్యాక్టరీల్లోనూ మహిళలకు నైట్ షిఫ్టులు.. కర్ణాటక ప్రభుత్వం జీవో..

ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

విద్యా,ఉపాధి రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ సెక్టార్‌లోని చాలా కంపెనీల్లో ఇప్పటికే మహిళలు నైట్ షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీవోతో ఫ్యాక్టరీల్లోనూ ఇకనుంచి మహిళలు నైట్ షిఫ్టుల్లో పనిచేయనున్నారు.

  • Share this:
    ఇకనుంచి ఫ్యాక్టరీల్లోనూ మహిళలకు నైట్ షిఫ్టుల్ని అనుమతిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక ఫ్యాక్టరీ చట్టంలో సవరణలు చేసి బుధవారం జీవో జారీ చేసింది. తాజా చట్ట సవరణతో ఫ్యాక్టరీల్లోనూ మహిళలు 24/7 పనిచేసేందుకు అవకాశం కల్పించినట్టయింది. అయితే మహిళల భద్రత రీత్యా నైట్ షిఫ్ట్‌ల పట్ల ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ప్రభుత్వ జీవో ప్రకారం.. ఫ్యాక్టరీల్లో మహిళలు రాత్రివేళ విధుల్లో ఉంటే.. వారి సంఖ్య మూడు వంతుల్లో రెండు వంతులకు(2/3) తగ్గకుండా ఉండాలి. అలాగే మహిళా సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అందుబాటులో ఉండాలి. ఇక సూపర్‌వైజర్‌లలో కచ్చితంగా ముగ్గురిలో ఒకరు(1/3) మహిళా సూపర్‌వైజర్ ఉండాలి. మరో ముఖ్య నిబంధన ఏంటంటే.. మహిళా ఉద్యోగి అంగీకారం లేకుండా.. వారికి నైట్ షిఫ్టులు కేటాయించవద్దు.సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన విశాఖ గైడ్ లైన్స్ ప్రకారం రాత్రివేళల్లో మహిళలు విధుల్లో ఉంటే.. అందుకు అనుగుణంగా లైంగిక వేధింపుల వ్యతిరేక నిబంధనలను కఠినంగా అమలుచేయాలి. దీనిపై పక్షం రోజులకు ఒకసారి లేబర్ డిపార్ట్‌మెంట్‌కు నివేదిక పంపించాలి.

    కాగా, విద్యా,ఉపాధి రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ సెక్టార్‌లోని చాలా కంపెనీల్లో ఇప్పటికే మహిళలు నైట్ షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా జీవోతో ఫ్యాక్టరీల్లోనూ ఇకనుంచి మహిళలు నైట్ షిఫ్టుల్లో పనిచేయనున్నారు.
    Published by:Srinivas Mittapalli
    First published: