టైపిస్ట్ జాబ్ కోసం మోదీని ఈ టైప్‌లో వాడుకున్నాడు...

హైకోర్టులో టైపిస్ట్ ఉద్యోగం కోసం ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసి రికమండేషన్ లెటర్‌ను సృష్టించాడు.

news18-telugu
Updated: December 30, 2018, 6:14 PM IST
టైపిస్ట్ జాబ్ కోసం మోదీని ఈ టైప్‌లో వాడుకున్నాడు...
ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: December 30, 2018, 6:14 PM IST
చేసేది ప్రైవేట్ ఉద్యోగం. కొద్దో గొప్పో బాగానే సంపాదిస్తున్నాడు. అయినా సరే ప్రైవేట్ ఉద్యోగం అంటే ‘తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది’ అని భావించాడు ఆ యువకుడు. ప్రభుత్వ ఉద్యోగం అయితే బెటర్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ ప్లాన్ వేశాడు. దాన్ని అమలు చేశాడు. సగం వరకు సక్సెస్ అయ్యాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఇంత విషయం ఎందుకు చెబుతున్నామంటే కర్ణాటకలోని బెళగావిలో సంజయ్ అనే ఓ యువకుడు ఓ చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టులో టైపిస్ట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. దానికి రిప్లై రాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అయితే, పెద్దల రికమండేషన్లు ఉంటే అలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చేస్తాయని భావించాడు. దేశంలో ప్రధాని కంటే పవర్ ఫుల్ ఎవరు ఉంటారని అనుకున్నాడు. ఏకంగా ప్రధాని మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసి.. ఆ రికమండేషన్ లెటర్ తీసుకుని వెళ్లి హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేశాడు.

హైకోర్టులో టైపిస్ట్ ఉద్యోగానికి ప్రధానమంత్రి రికమండేషన్ చేయడమా అని హైకోర్టు అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే దీనిపై విచారణ జరపాలంటూ విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వారు ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో ఏమైనా రికమండేషన్ లెటర్లు ఇచ్చారా అని వివరాలు కోరారు. అయితే, అలాంటిదేమీ లేదని సమాధానం రావడంతో.. సంజయ్ .. మోదీ సంతకాలను ఫోర్జరీ చేశాడన్న విషయం నిర్ధారణ చేసుకున్నారు. బెళగావి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇంతకీ ప్రధాని మోదీ సంతకం ఎలా ఫోర్జరీ చేశావని ప్రశ్నిస్తే.. అతను చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య కాలంలో ప్రధాని మోదీ సంతకం అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దీంతో ఇంటర్నెట్‌‌లో పరిశోధించి బాగా సంతకం ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ప్రధాని కార్యాలయం లెటర్ హెడ్ ఎలా ఉంటుందో పరిశీలించాడు. అచ్చం అలాగే లెటర్ హెడ్ కూడా తయారు చేశాడు. కానీ, చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సమస్య ఇప్పుడు నెలకొందని తేలింది.

First published: December 30, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...