హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్.. వెంట పడిన యువతి.. అతడు వినలేదు.. తిక్కరేగి ఆమె ఏం చేసిందంటే..

నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్.. వెంట పడిన యువతి.. అతడు వినలేదు.. తిక్కరేగి ఆమె ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka: అతడి నుంచి ఊహించని సమాధానం రావడంతో సుమ షాక్‌లోకి వెళ్లింది. ఎన్నోసార్లు బతిమిలాడింది. బెదిరించింది. ఐనా అతడు అదే సమాధానం చెప్పాడు. కానీ ఆమె తగ్గలేదు. చివరకు ఎంత పనిచేసిందంటే

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రేమోన్మాద ఘటనలు చూశాం. పెళ్లికి నిరాకరించిందని యువతిపై యువకుడు దాడి చేశాడని.. తన ప్రేమను ఒప్పుకోలేదని యువతి హత్య చేసిన ఉన్మాది అని.. అప్పడప్పుడూ వార్తల్లో చూస్తుంటాం. ఇలాంటి ఘటనలో ఎక్కువగా యువతులే బాధితులు ఉంటారు. కానీ కర్నాటకలో మాత్రం ఇందుకు రివర్స్‌లో జరిగింది. పెళ్లికి నిరాకరించాడని ఓ యువకుడిపై యువతి దాడి చేసింది. దాడి అంటే భౌతిక దాడి కాదు. ఏకంగా అతడి ఇంటితో పాటు జీవనాధారమైన ఆటోను కూడా తగులబెట్టింది. కర్నాటక (Karnataka)లోని బీదర్‌లో ఈ ఘటన జరిగింది.

Bride:మరికాసేపట్లోనే పెళ్లి...పెళ్లి మండపంలో ఉన్న వధువు...అంతలోనే   అక్కడికి ఓ వ్యక్తి వచ్చి..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... బీదర్‌ జిల్లా బసవకల్యాణ్ తాలుకా సస్తాపూర్ గ్రామానికి చెందిన భీమరావు తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే భీమరావుకు సుమ అనే యువతి పరిచయమయింది. ఆ పరిచయం చివరకు ప్రేమగా మారింది. అలా కొన్నాళ్ల పాటు వారిద్దరు కలిసి తిరిగారు. ఐతే ఇటీవల ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. నన్ను పెళ్లి చేసుకోవా.. అని ఆశగా అడిగింది. కానీ అతడు షాకింగ్ రిప్లై ఇచ్చాడు. మనిద్దరం మంచి స్నేహితులమని.. తనకు ఆ ఉద్దేశం లేదని చెప్పాడు. పెళ్లి చేసుకోలేనని కుండబద్దలు కొట్టాడు. అతడి నుంచి ఊహించని సమాధానం రావడంతో సుమ షాక్‌లోకి వెళ్లింది. ఎన్నోసార్లు బతిమిలాడింది. బెదిరించింది. ఐనా అతడు అదే సమాధానం చెప్పాడు. భీమరావు ఎన్నిసార్లు చెప్పినా సుమ మాత్రం తగ్గలేదు. పెళ్లి కోసం ఒత్తిడి తెస్తూనే ఉంది.

Road Accident: ఆరు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.. ఇంతలోనే ఊహించని విషాదం

సుమ ఒత్తిడిని భరించలేక భీమరావు తన స్వగ్రామాన్ని వదిలిపెట్టాడు. తల్లిని తీసుకొని బాగ్ హిప్పర గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. ఐనా కూడా సుమను వదిలిపెట్టలేదు. నిన్ను ఎంతో నమ్మానని.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రూ.4 లక్షల సాయం కూడా చేశానని గొడవపెట్టుకుంది. తనను వివాహం చేసుకోకుంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. కానీ భీమ రావు మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై పగ పెంచుకుంది సుమ. తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. కొందరు మనుషులను పంపిన.. భీమరావు ఇంటితో పాటు అతడి జీవనాధారమైన ఆటోను కూడా తగులబెట్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ పని చేసింది సుమ. భీమరావు ఇల్లుతో పాటు ఆటో కూడా పూర్తిగా కాలిపోయాయి. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published:

Tags: Crime news, Karnataka

ఉత్తమ కథలు