హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గల్ల పెట్టె మాదిరిగా మారిన పొట్ట.. బయటపడ్డ 187 కాయిన్స్.. ఎక్కడంటే..

గల్ల పెట్టె మాదిరిగా మారిన పొట్ట.. బయటపడ్డ 187 కాయిన్స్.. ఎక్కడంటే..

కడుపులో కాయిన్స్

కడుపులో కాయిన్స్

Karnataka: వ్యక్తికి కడుపు నొప్పిరావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అతనికి ఎండోస్కోపీ టెస్ట్ చేశారు. అప్పుడు కడుపులో ఉన్న వాటిని చూసి డాక్టర్లు షాకింగ్ కు గురయ్యారు.

  • Local18
  • Last Updated :
  • Karnataka, India

కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆడుకుంటుండగా నాణేలు మింగేస్తుంటారు. మరికొందరు కావాలనే చిన్న ఆటవస్తువులను తెలియకుండా తింటుంటారు. అయితే.. కొన్నిసార్లు.. కొందరి వ్యక్తుల కడుపులలో రాళ్లు, ఇతర బరువైన పదార్థాలు ఉన్నఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉంటాయి. వెంట్రుకలు కూడా కడుపులో బయటపడిన సంఘటనలు మనం చూస్తునే ఉంటాం. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో (Karnataka)  ఒక ఊహించని సంఘటన వెలుగులోనికి వచ్చింది. బాగల్ కోట్ ప్రాంతంలో ఉన్న హెచ్ఎస్ కే ఆస్పత్రిలో 58 ఏళ్ల వ్యక్తి కడుపునొప్పితో చేరాడు. అతనికి వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు. అప్పుడు స్కానింగ్ రిపోర్టులో షాకింగ్ విషయం బయటపడింది. ఆ వ్యక్తి కడుపులో నాణేలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఎండోస్కోపీ నిర్వహించి సర్జరీ చేశారు. ఈ క్రమంలో.. 5 రూపాయల 56 నాణేలు, 2 రూపాయల 51 నాణేలు, 1 రూపాయి 80 నాణేలు సహా మొత్తం 187 నాణేలు లభ్యమయ్యాయి.

ఈ సర్జరీని వైద్యులు డా. ఈశ్వర్ కలబురగి, డా. ప్రకాష్ కట్టిమాని, ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్. అర్చన, డాక్టర్ రూపా హులకుండే బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. కడుపులో ఇన్ని నాణేలు ఎందుకు బయటపడ్డాయో తెలియరాలేదు. అతను ఇన్ని నాణేలను ఎందుకు మింగాడు అనేది మిస్టరీ. కడుపులో నుంచి మొత్తం 187 నాణేలను తొలగించిన వైద్యుల బృందం ప్రశంసలు అందుకుంది. దేశ విదేశాల్లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటన జరగడం, ఇప్పుడు బాగల్‌కోట్‌లోనే జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

First published:

Tags: Coins, Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు