హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కౌన్సిలర్లకు మంత్రి దివాళీ గిఫ్ట్..114గ్రాముల బంగారం, కిలో వెండి,లక్ష నగదు,పట్టు చీర..

కౌన్సిలర్లకు మంత్రి దివాళీ గిఫ్ట్..114గ్రాముల బంగారం, కిలో వెండి,లక్ష నగదు,పట్టు చీర..

మంత్రి గారిచ్చిన దివాళీ గిఫ్ట్ లు

మంత్రి గారిచ్చిన దివాళీ గిఫ్ట్ లు

Karnataka Minister Diwali Gifts : దీపావళి(Deepawali) పండుగను మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా పలువురు తమ దగ్గర పనిచేసే సిబ్బందికి బహుమతులు ఇస్తుండటం మనకు తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Karnataka Minister Diwali Gifts : దీపావళి(Deepawali) పండుగను మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు. దీపావళి సందర్భంగా పలువురు తమ దగ్గర పనిచేసే సిబ్బందికి బహుమతులు ఇస్తుండటం మనకు తెలిసిందే. అయితే కర్ణాటక టూరిజం మంత్రి ఆనంద్ సింగ్(Minister Anand Singh) దీపావళికి అందించిన ఖరీదైన గిఫ్ట్ లు ఇప్పుడు హాట్ టాపిక్ అంశంగా మారింది. మున్సిపల్ కౌన్సిల్, పట్టణ పంచాయతీ సభ్యులు, గ్రామపంచాయతీ సభ్యులకు వెండి, నగదు, పట్టుచీరలు, పంచెలు ఇవ్వడం వివాదానికి దారితీసింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల నేతలు ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్ మున్సిపల్‌, పట్టణ పంచాయతీ సభ్యులకు రూ.లక్ష 44 వేల నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, పట్టుచీర, పంచ, చొక్కా, ముత్యాల తలంబ్రాలు, డ్రైఫ్రూట్స్‌ అందజేసి తన నియోజకవర్గ ప్రతినిధులను తనకు మద్దుతుగా ఉండేలా మంత్రి ఆనంద్ సింగ్ పెద్ద ప్లాన్ చేశారు. అలాగే హోస్పేట్‌లోని 182 మంది గ్రామపంచాయతీ సభ్యులకు అర కేజీ వెండి, 27 వేల నగదు, పట్టుచీర, పంచ, పట్టు చొక్కా, ముత్యాల తలంబ్రాలు, డ్రైఫ్రూట్స్‌ అందజేశారు. దీనికి తోడు దీపావళి పండుగ శ్రీ లక్ష్మీ పూజ ఆహ్వాన పత్రాన్ని విడుదల చేసి పూజకు ఆహ్వానించారు. మంత్రి ఇచ్చిన దీపావళి కానుకల వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హోస్పేట్ మున్సిపల్ కౌన్సిల్‌లో 35 మంది సభ్యులు, 5 నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. 282 మంది సభ్యులతో తాలూకాలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగర నియోజకవర్గంలోని 10 గ్రామ పంచాయతీల్లో 182 మంది సభ్యులు ఉన్నారు. ప్రతి దీపావళికి ఆనంద్ సింగ్ ప్రజాప్రతినిధులకు బహుమతులు పంపేవారని ఆనంద్ సింగ్ మద్దతుదారులు తెలిపారు. అయితే ఈసారి ఎన్నికల కారణంగా వివాదం తలెత్తిందని అన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ముఖ్య వ్యక్తులకు బహుమతులు పంపారు. ఆనంద్ సింగ్ ప్రతి గణేశ, దీపావళి పండుగలకు పూజ కోసం ఆహ్వాన లేఖతో పాటు బహుమతులు పంపుతారు... సన్నిహితులకు, ప్రజాప్రతినిధులకు పంపారు... ఈసారి ఎందుకు వివాదం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

Diwali 2022 : దీపావళిని ఆ దేశాల్లో కూడా జరుపుకుంటారు..ఆ పేర్లతో దీపావళి సెలబ్రేషన్స్

కంపెనీ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్

మరోవైపు, దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు, దుకాణాలు తమ ఉద్యోగులకు ఒక నెల జీతాన్ని బోనస్‌గా ఇవ్వడం ఆనవాయితీ. అయితే సూరత్‌కు చెందిన ఓ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఉద్యోగులకు బంపర్ కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉద్యోగుల్లో ఆనందాన్ని పెంచారు. సూరత్‌కు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను బహుమతిగా ఇచ్చింది. ఎంబ్రాయిడరీ మెషీన్‌ల వ్యాపారం చేసే అలయన్స్ గ్రూప్, ఓకినావా ప్రైస్‌ప్రో అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూ.76,848 ధరతో అందించాలని నిర్ణయించింది." పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని, మేము మా ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము"అని కంపెనీ డైరెక్టర్ సుభాష్ దావర్ చెప్పారు. ఇది ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుందని కంపెనీ పేర్కొంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను ఆదా చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ, హరిత దేశం ఆలోచనలను సజీవంగా ఉంచేందుకు మా కంపెనీకి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు

First published:

Tags: Diwali, Karnataka

ఉత్తమ కథలు