హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Caravan Tourism : సుదూర పర్యాటక ప్రాంతాల్లో కారవాన్‌లో బస.. పర్యాటకులకు కొత్త అనుభూతి..

Caravan Tourism : సుదూర పర్యాటక ప్రాంతాల్లో కారవాన్‌లో బస.. పర్యాటకులకు కొత్త అనుభూతి..

Caravan Tourism : సుదూర పర్యాటక ప్రాంతాల్లో కారవాన్‌లో బస.. పర్యాటకులకు కొత్త అనుభూతి..

Caravan Tourism : సుదూర పర్యాటక ప్రాంతాల్లో కారవాన్‌లో బస.. పర్యాటకులకు కొత్త అనుభూతి..

Caravan Tourism : పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు, సుదూర, మారుమూల ప్రాంతాల్లో కూడా వసతి సదుపాయాలను పెంచేందుకు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. కారవాన్‌(Caravan)ల సంస్కృతిని పరిచయం చేసేందుకు సిద్దమవుతోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని ప్రత్యేక పర్యాటక డెస్టినేషన్లలో కర్ణాటక (Karnataka) ఒకటి. ఇక్కడి వన్యప్రాణులు, ప్రకృతి అందాలు, పర్వత ప్రాంతాలను చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు, సుదూర, మారుమూల ప్రాంతాల్లో కూడా వసతి సదుపాయాలను పెంచేందుకు కర్ణాటక పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. కారవాన్‌(Caravan)ల సంస్కృతిని పరిచయం చేసేందుకు సిద్దమవుతోంది.

* కారవాన్‌లోనే వంట, రాత్రి బస

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో కారవాన్‌లోనే వంట చేసుకుని, అందులోనే రాత్రి బస చేసే అవకాశం త్వరలోనే కలుగబోతోంది. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కారవాన్ పార్కులను రూపొందించాలని కర్ణాటక పర్యాటక శాఖ యోచిస్తోంది. కారవాన్‌లు ప్రయాణం, విశ్రాంతి, వసతి కోసం ప్రత్యేకంగా నిర్మించే వాహనాలు. ఇటీవల కర్ణాటకలోని ప్రధాన పర్యావరణ, సాహస, వన్యప్రాణులు, తీర్థయాత్ర గమ్యస్థానాలలో కారవాన్ పార్కుల అభివృద్ధి కోసం వివిధ సంస్థల నుంచి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ను కర్ణాటక పర్యాటక శాఖ ఆహ్వానించింది.

* కారవాన్‌ పార్క్‌ల ఏర్పాటు

కార్‌వాన్‌లలో వినోద వాహనాలు(RV), క్యాంపర్‌వాన్‌లు, మోటారు హోమ్‌లు ఉన్నాయి. సాధారణంగా సీట్లు, టేబుల్‌లు, పడుకునే వసతి, వంట సౌకర్యాలు మొదలైనవి ఉంటాయి. కారవాన్ పార్క్ అంటే వాహనాలను కేటాయించిన ప్రదేశాలలో రాత్రంతా పార్క్ చేస్తారు. కనీసం అర ఎకరం (21,800 చ.అ.) స్థలంలో కనీసం ఐదు పార్కింగ్ కేంద్రాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో సాంద్రత హెక్టారుకు 60 వ్యాన్‌ల కంటే ఎక్కువ ఉండదు. కర్ణాటక టూరిజం పాలసీ 2020-26 ప్రకారం అభివృద్ధి, ప్రచారం చేయాల్సిన ముఖ్య అంశాలలో కారవాన్ టూరిజం ఒకటని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి : పెరిగిన హిమాలయన్‌ వయాగ్రా లభ్యత.. కిలో రూ.12 లక్షలు.. ప్రత్యేకతలివే..

* సుదూర ప్రాంతాల్లో ఇలా..

దీనికి సంబంధించి కొన్ని సంస్థలు స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన పద్ధతిలో కారవాన్‌లను ఏర్పాటు చేస్తాయని డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. అన్ని రకాల వసతులు అందేలా వీటిని డిజైన్‌ చేస్తాయని అధికారులు తెలిపారు. ఈ కంపెనీలు నిర్వహణకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటాయని, పర్యాటకులకు అన్ని రకాల సౌలభ్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఎకో, అడ్వెంచర్, వన్యప్రాణులు, తీర్థయాత్ర టూరిజంకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. మారుమూల ప్రాంతాలు, అడవులను సందర్శించడం, అక్కడే బస చేయడం వంటి కార్యకలాపాలు కారవాన్‌ల సదుపాయాలతో పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.

* అన్ని వర్గాలకు ప్రధాన ఆకర్షణ

పర్యాటక ప్రదేశాలలో, ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలలో కొన్ని సందర్భాల్లో శాశ్వత నిర్మాణాలకు అనుమతి ఉండదని సంబంధిత అధికారి పేర్కొన్నారు. అలాంటి చాలా ప్రదేశాలలో ఇప్పటికే వసతి కొరత ఉందని, కారవాన్ టూరిజం పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థవంతంగా తీర్చగలదని చెప్పారు. అదే సమయంలో నాణ్యత, ప్రమాణాలు, భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. యువకులు, కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు, విదేశీయులు సహా అన్ని వర్గాల పర్యాటకులను ఆకర్షిస్తుందని వివరించారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Karnataka, National News, Tourism, Travelling

ఉత్తమ కథలు