హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పాదయాత్రలో జోష్ గా పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి... రాహుల్ తో కలిసి ఏంచేశారంటే.. వీడియో వైరల్..

పాదయాత్రలో జోష్ గా పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి... రాహుల్ తో కలిసి ఏంచేశారంటే.. వీడియో వైరల్..

భారత్ జోడో యాత్రలో రాహుల్, సిద్ధరామయ్య

భారత్ జోడో యాత్రలో రాహుల్, సిద్ధరామయ్య

Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో పేరిట యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర దాదాపు.. 3,500 దూరం కొనసాగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

వచ్చే లోక్ సభ ఎన్నికలలో మరల కాంగ్రెస్ పార్టీని (Congress)  అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,500 కిలో మీటర్ల మేర భారత్ జోడో పేరిట పాదయాత్రను చేపట్టారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే అనేక మంది ఈ యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర (Bhrat jodo yatra) కర్ణాటకలో కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా రాహుల్ (Rahul gandhi) చేపట్టిన యాత్రలో సోనియా గాంధీ (Sonia gandhi) కూడా పాల్గొని, కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ ను నింపారు. ఈ క్రమంలో కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah’s) కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయన 75 ఏళ్ల వయసులో కూడా ఫుల్ జోష్ గా పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడిచారు. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది.

రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్య చేతిని పట్టుకుని కొంచెం దూరం పరిగెత్తి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉల్లాసాన్ని నింపారు. దీంతో వారు పరిగెత్తడంతో, అక్కడి వారు కూడా ఉత్సాహంగా పాల్గొని రాహుల్ తో కలిసి పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video)  మారింది.

ఇదిలా ఉండగా  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం  కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సుమారు 3,570 కి.మీ మేర భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 148 రోజుల పాటు రాహుల్ నేతృత్వంలో నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేయాలన్నది ప్రణాళిక. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ జోడో యాత్ర ప్రారంభించారు. తమిళనాడు , కేరళలో పూర్తి చేసుకుని ప్రస్తుతం కర్ణాటకలో జోడో యాత్ర కొనసాగుతోంది.

గురువారం భారత్​ జోడో యాత్ర 29వ రోజు. అయితే ఇవాళ రాహుల్‌తో క‌లిసి సోనియా గాంధీ (Sonia Gandhi)కూడా యాత్ర‌లో న‌డిచారు. గురువారం ఉదయం 6.30 గంటలకు మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని బెల్లాలే గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. జక్కనహళ్లి క్రాస్ దగ్గర సోనియా గాంధీ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా సోనియాతో క‌లిసి ఉత్సాహంగా న‌డిచారు. యాత్ర‌లో భాగంగా వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో రాహుల్ త‌న త‌ల్లి సోనియా బూట్లకు లేస్ క‌ట్టారు. నియా గాంధీతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్,కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్,మాజీ సీఎం సిద్దరామయ్య   తదితరులు భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి అడుగులు వేశారు.సోనియాగాంధీ యాత్రలో పాల్గున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మరింత రెట్టింపయిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bharat Jodo Yatra, Karnataka, Rahul Gandhi

ఉత్తమ కథలు