హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Umesh Katti: హార్ట్ ఎటాక్‌తో కర్నాటక మంత్రి కత్తి మహేష్‌ మృతి .. సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి

Umesh Katti: హార్ట్ ఎటాక్‌తో కర్నాటక మంత్రి కత్తి మహేష్‌ మృతి .. సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి

Umesh katti(file photo)

Umesh katti(file photo)

Umesh Katti: మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణంపై సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చురుకైన నాయకుడిని, నమ్మకమైన ప్రజా సేవకుడిని కోల్పోయామని ఆయన అన్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కర్ణాటక మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కత్తి (61) కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన చనిపోయారు. డాలర్స్ కాలనీలోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో రాత్రి స్పృహ తప్పి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఉమేష్ కత్తి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బసవరాజ్ బొమ్మై (Basavraj Bommai) ప్రభుత్వంలో ఉమేష్ కత్తి (Umesh Katti) రెండు కీలకమైన శాఖల బాధ్యతలను చూస్తున్నారు. పౌర సరఫరాలు, అటవీశాఖకు ఆయన మంత్రగా ఉన్నారు. ఉమేష్ కత్తి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంత్రి హఠాన్మరణంపై సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చురుకైన నాయకుడిని, నమ్మకమైన ప్రజా సేవకుడిని కోల్పోయామని ఆయన అన్నారు.

  ''నా ఆప్త మిత్రుడిని కోల్పాయాను. ఉమేష్ కత్తి నా సోదరుడిలాంటివారు. ఆయనకు గుండె సంబంధ సమస్యలు ఉన్నాయి. కానీ ఇంత త్వరగా మరణిస్తారని అస్సలు అనుకోలేదు. రాష్ట్రం కోసం ఎంతో సేవ చేశారు. తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేవారు. ఉమేష్ కత్తి మరణం రాష్ట్రారినిక తీరని లోటు.'' అని బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.

  ఉమేష్ కత్తి బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు. 1985లో తన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. బెలగావి జిల్లా హుక్కేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనతాపార్టీ, జనతాదళ్, జేడీ(ఎస్)లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2008లో బీజేపీలో చేరారు. గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడ్యూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ షెట్టర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు ఉమేష్ కత్తి. ప్రత్యేక ఉత్తర-కర్ణాటక రాష్ట్ర హోదా కోసం చాలా సార్లు తన గళం వినిపించారు.

  ఉమేష్ కత్తి భౌతిక కాయాన్ని ఎయిర్ అంబులెన్స్‌లో బెంగళూరు నుంచి స్వగ్రామానికి తరలించనున్నారు. సంకేశ్వరలో మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు చూసేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత అంత్యక్రియల కార్యక్రమాలు జరుగుతాయి. బాగేవాడి బెళగావిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఉమేష్ కత్తి మృతితో బెళగావిలోని పాఠశాలలు, కళాశాలలకు కర్ణాటక ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Karnataka

  ఉత్తమ కథలు