మహిళతో మంత్రిగారి రాసలీలలు.. సీడీ బయటపెట్టిన సామాజిక కార్యకర్త

రమేష్ జార్కిహోళి (Image; Twitter)

కర్ణాటకలో ఓ మంత్రి సెక్స్ టేప్‌లో దొరికిపోయారు. ఆయన ఓ మహిళతో ఆంతరంగికంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. మంత్రి రమేష్ జరకిహోలి ఈ వీడియోలో ఉన్నారు. ఇది హనీ ట్రాప్ అని భావిస్తున్నారు.

 • Share this:
  కర్ణాటకలో ఓ మంత్రి సెక్స్ టేప్‌లో దొరికిపోయారు. ఆయన ఓ మహిళతో ఆంతరంగికంగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. మంత్రి రమేష్ జరకిహోలి ఈ వీడియోలో ఉన్నారు. ఇది హనీ ట్రాప్ అని భావిస్తున్నారు. ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు ఈ వీడియోను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి దినేష్ మలహల్లి అనే ఆర్టీఐ కార్యకర్త కబ్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. దీనిపై అంతర్గత విచారణ జరుగుతోందని చెప్పారు. బహుశా అది పరస్పర ఆమోదంతో జరుగుతున్న శృంగారంగా భావిస్తున్నట్టు చెప్పారు. గతంలో హెచ్ డీ కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి జంప్ అయిన ఆయన చాలా మంది ఎమ్మెల్యేలను బీజేపీ వైపునకు తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత బీఎస్ యడియూరప్ప సీఎం అయ్యారు. రమేష్ జరకలిహోలికి ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల శాఖను కేటాయించారు.

  సామాజిక కార్యకర్త, నాగరిక హక్కు పోరాట సమితి దినేష్ కలహళ్లి దీనికి సంబంధించి లేఖను కూడా రిలీజ్ చేశారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ వద్దకు తీసుకుని వెళ్తానని చెప్పారు. మంత్రి బాధితులు తన వద్దకు వచ్చి తమకు న్యాయంచేయాలని కోరారని అందుకే తాను దీన్ని బయట పెట్టానని చెప్పారు.  ఏకంగా మంత్రి సెక్స్ స్కాంలో ఇరుక్కోవడం ముఖ్యమంత్రి యడియూరప్పకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో రమేష్ తో రాజీనామా చేయించాలని యడియూరప్ప భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: