• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • KARNATAKA MINISTER BC PATIL GETTING COVID19 VACCINE AT HOME AND THE VIDEO AND PICTURES GOES VIRAL SSR

Karnataka minister: ప్రధాని మోదీ కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆస్పత్రికెళితే.. ఈ మంత్రి గారు మాత్రం..

Karnataka minister: ప్రధాని మోదీ కూడా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆస్పత్రికెళితే.. ఈ మంత్రి గారు మాత్రం..

ఇంటిలో ఉండి వ్యాక్సిన్ తీసుకుంటున్న మంత్రి పాటిల్

ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కూడా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి టీకా వేయించుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాట్నాలో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇలా ప్రముఖులంతా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి మరీ వ్యాక్సిన్ తీసుకుంటుంటే..

  • Share this:
    న్యూఢిల్లీ: కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కర్ణాటక మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక మంత్రి బీసీ పాటిల్ ఇంటిలో ఉండి కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సదరు మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఇంటి నుంచైనా కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవచ్చని ప్రొటోకాల్‌లో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరినట్లు కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు కూడా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి టీకా వేయించుకున్నారు.

    బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా పాట్నాలో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇలా ప్రముఖులంతా వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి మరీ వ్యాక్సిన్ తీసుకుంటుంటే.. కర్ణాటక మంత్రి పాటిల్ మాత్రం ఇంట్లో ఉండే వ్యాక్సిన్ తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆయన ఇంట్లో ఉండి టీకా వేయించుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో పలువురు నెటిజన్లు ఆయన తీరును తప్పుబడుతున్నారు.

    BC Patil, Karnataka minister, Covid19 vaccine, Covid19 vaccine at home, PM Modi, Corona
    వ్యాక్సిన్ తీసుకుంటున్న మంత్రి పాటిల్ భార్య


    మంత్రి పాటిల్ ప్రొటోకాల్ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. మంత్రి భార్య కూడా ఇంట్లోనే ఉండి వ్యాక్సిన్ తీసుకోవడం గమనార్హం. అయితే.. ఈ పరిణామం వివాదాస్పదంగా మారడంతో మంత్రి పాటిల్ స్పందించారు. ఇంట్లో చాలామంది ప్రజలు తనను కలిసేందుకు వచ్చి ఉన్నారని.. అలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్లి వేచి ఉండటమంటే అరగంటకు పైగానే పడుతుందని.. అందుకే ఇంటిలోనే ఉండి వ్యాక్సిన్ తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాదు, ఇంటి నుంచే వ్యాక్సిన్ తీసుకున్న తన నిర్ణయం ఏమాత్రం తప్పుకాదని మంత్రి సమర్థించుకోవడం కొసమెరుపు.

    వ్యాక్సిన్ తీసుకునేందుకు తాను కేవలం హెల్త్ అఫిషియల్స్‌ను మాత్రమే పిలిచానని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆసుపత్రులకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో ఈ కర్ణాటక మంత్రి మాత్రమే ఎందుకీ పంథాను ఎంచుకున్నారన్న చర్చ మొదలైంది. యడియూరప్ప ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు మంత్రి పాటిల్ అవకాశమిచ్చినట్లయింది. ఈ ప్రభుత్వంలో ఎవరు ఏమనుకున్నా చేయొచ్చని జేడీఎస్ నేత కుమారస్వామి విమర్శించారు. మంత్రి పాటిల్ 2020 ఆగస్ట్‌లో కరోనా బారిన పడి కోలుకోవడం గమనార్హం.
    Published by:Sambasiva Reddy
    First published: