మనలో చాలా మందికి తమ పిల్లలకు మంచి క్వాలిటీ విద్యను అందించాలని ఉంటుంది. కానీ వారి ఆర్థిక సమస్యల వలన కొన్నిసార్లు మంచి విద్యను ఇవ్వలేకపోతుంటారు. అదే విధంగా మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. తమ ఉద్యోగం చేస్తునే తీరిక సమయాల్లో పేదవారికి ఏదైన చేయాలనే గొప్పమనసు కల్గిఉంటారు.
ఇలాంటి వారు తరచుగా ట్యూషన్ లు చెప్పడం లేదా పేదవిద్యార్థులకు ఆర్థికంగా ఏదైన సహాయం చేయడం చేస్తుంటారు. ఇవన్ని మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే.. కలబురిగి చెందిన సదరు దంపతులు మాత్రం తమ స్కూల్ ముగిసాక విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తుంటారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
కర్ణాటకలోని (Karnataka) కలబురిగిలో మహేష్ బడిగేర్, సుమిత్రా బడిగేర్ ఉంటున్నారు. వీరిద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేస్తు మంచి జీవితం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. వీరు పాఠశాల ముగిసాక పేద విద్యార్థులకు క్లాసులను బోధిస్తుంటారు. మహేష్ గణితం, ఇంగ్లీష్, సుమిత్రా సైన్స్, బోధిస్తుంటుంది. వీరి ఇంట్లోనే ఓపెన్ ట్యూషన్ ను నడిపిస్తున్నారు.
దీనికి ప్రతిరోజు వందల మంది పేద విద్యార్థులు వస్తుంటారు. ఈ ఇద్దరు భార్యాభర్తలు ఓపెన్ స్కూల్‌లో బోధిస్తున్నారు. వారి పేర్లు మహేష్ బడిగేర్ మరియు సుమిత్రా బడిగేర్, వారు కలబురగికి చెందిన వీరేంద్ర పాటిల్ బరంగయ్ నివాసితులు. వారి చదువుపై ఉన్న ప్రేమ పిల్లలకు ఆరుబయట బోధిస్తుంటారు.
ఉచిత తరగతులు అందిస్తున్న జంట
ఎనిమిది గంటల పాటు బడిలో పిల్లలకు చదువు చెప్పే మహేశ్ బడిగేర్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఓపెన్ ఎయిర్ స్కూల్ లో పిల్లలకు ఉచితంగా ట్యూషన్ చెప్పేవాడు. దీనికి ఆయన భార్య సుమిత్ర కూడా బోధిస్తుంది. ప్రతిరోజూ రెండు గంటలు పిల్లల చదువుకు కేటాయిస్తున్నారు.
రెండు నెలల క్రితం క్లాస్ లు స్టార్ట్ అయ్యాయి. పేద పిల్లలతో పాటు ఇప్పుడు ధనిక కుటుంబాలకు చెందిన కొంతమంది పిల్లలు కూడా మహేష్ క్లాస్ కి హాజరవుతున్నారు. అంతేకాదు ఖాళీ సమయాల్లో తన టీచర్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పర్ట్స్‌ని పిలిచి మరీ పిల్లలకు చదువు చెప్పించే పనిలో బిజీగా ఉన్నాడు మహేష్. కాగా, మొత్తానికి పేదలకు మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్న దంపతల పట్ల స్థానికులు, తోటి ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, VIRAL NEWS