మనం సాధారణంగా తరచుగా చెట్లను రీలోకేషన్ చేయడం వింటుంటాం. అదే విధంగా.. రోడ్లపైన ఏదైన నిర్మాణం చేపట్టినప్పుడు అక్కడ ఉన్న చెట్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఎవరైన గుడిసెలు వేసుకుని ఉంటే.. వారిని ఇతర ప్రదేశాలలోకి తరలించి పునరావాసం కల్పిస్తుంటారు. అంతే కాకుండా వారు ఉన్న ప్రదేశంలో జరిగిన నష్టానికి, మంచి సదుపాయాలను ప్రజలకు ప్రభుత్వాలు కల్పిస్తుంటాయి. అయితే... ఇక్కడ ఏకంగా పదివేల వరకు చేపలను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పూర్తివివరాలు.. మంగళూరులోని (Karnataka) కొడియాల విల్లేలోని టీఎంఏపీఐ కన్వెన్షన్ సెంటర్ లో ఎదుట ప్రత్యేక నిర్మాణం ఉంది. అందులో అడుగు భాగంలో చేపలను అధికారులు తరలిస్తున్నారు. 11 రోజులుగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు నీటిని ఖాళీ చేయించారు.మంగళూరులోని కొడియాలవిల్లేలోని టీఎంఏపీఐ కన్వెన్షన్ సెంటర్ ఎదుట నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అడుగుభాగంలో ఉన్న చేపలను తరలించి భద్రపరిచారు.
ఈ భవనం అడుగుభాగంలో మొత్తం 3 ఎకరాల్లో నీరు నిలిచింది. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ఈ నీటిలో చేపలను వదిలారు. ఆ పిల్లలు ఇప్పుడు 10,000 కంటే ఎక్కువ చేపలుగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు అసంపూర్తిగా ఉన్న పనులను మళ్లీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో.. జీత్ మిలన్ రోచ్, భువన్ దేవాడిగ, సెల్మా, నిధి, అతిక్లకు పని సమయంలో చేప పిల్లలను రక్షించే బాధ్యతను అప్పగించారు. కాగా, ఇప్పటి వరకు చెట్లను,మనుషులను మాత్రమే రిలోకేషన్ చేయడం వింటూవచ్చాం. ఇప్పుడు కొత్తగా.. చేపలను తరలించి భద్రపరిచారనే వార్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ (/viral news) అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, VIRAL NEWS