• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • KARNATAKA MAN TAKES HIS LATE SON PHOTO TO WATCH YUVARATNA MOVIE IN THEATRE SU

చనిపోయిన కొడుకు ఫొటోతో సినిమా థియేటర్‌కు వచ్చిన తండ్రి.. అక్కడున్న వారు ఏమిటని ఆరా తీయగా..

థియేటర్స్ (Theatres)

ఓ వ్యక్తి చనిపోయిన కొడుకు ఫొటోతో సినిమా థియేటర్‌కు వచ్చాడు. అయితే అక్కడున్న వారు ఏమిటని ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    ఓ వ్యక్తి తన కుమారుడిపై ఇష్టాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. మరణించిన కొడుకు ఇష్టాన్ని గౌరవించి.. అతను ఈలోకంలో లేకపోయినప్పటికీ అతని కోరిక తీర్చుతున్నట్టుగా భావించాడు. ఈ క్రమంలోనే కొడుకు ఫొటోతో సినిమా థియేటర్‌కు వచ్చి సినిమా చూశాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మైసూరు కువెంపు నగరకు చెందిన మురళీధర్‌ అనే వ్యక్తి కుమారుడు హరికృష్ణన్‌ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. అతని సినిమాలంటే విపరీతమైన పిచ్చి. పునీత్ రాజ్‌కుమార్ సినిమా విడుదలైదంటే ఫస్ట్ రోజు చూడాల్సిందే. అయితే పునీత్ రాజ్‌కుమార్ తాజా చిత్రం యువరత్న ఏప్రిల్ 1న విడుదలయింది. పునీత్ రాజ్‌కుమార్ అంటే చాలా ఇష్టపడే హరికృష్ణన్.. ఈ సినిమా విడుదల కోసం ఎంతగానో వెయిట్ చేశాడు. అయితే సినిమా విడుదలకు ముందే మురళీధర్ ఓ ప్రమాదంలో మరణించాడు.

    నాలుగు నెలల క్రితం స్నేహితుడితో కలిసి వరుణ కాలువలో ఈతకు వెళ్లి నీట మునిగి చనిపోయాడు. హరికృష్ణన్ మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే అతడి తండ్రికి మాత్రం కొడుకు బతికి ఉన్నప్పుడు చెప్పిన మాటలు అలా గుర్తుండిపోయాయి. యువరత్న సినిమా విడుదలైన రోజే చూడాలని కొడుకు తనతో చెప్పిన మాటలను మురళీధర్ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1వ తేదీన యువరత్న సినిమా విడుదలైంది.

    Vijayawada: సాప్ట్‌వేర్‌ ఉద్యోగినిపై అత్యాచార యత్నం.. కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో..

    Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

    దీంతో మురళీధర్ తన కొడుకు ఫొటోతో పాటుగా యువరత్న సినిమా ఆడుతున్న థియేటర్‌కు వెళ్లాడు. మురళీధర్‌తో పాటు అతని భార్య, మరో కుమారుడు వచ్చారు. ఇలా వారు సినిమా థియేటర్‌కు వెళ్లి నాలుగు టికెట్లు తీసుకుని సినిమా చూశారు. అయితే మురళీధర్ కుటుంబం ఫొటోతో సినిమా థియేటర్‌కు రావడంతో.. అక్కడున్న ఏమిటా అని ఆరా తీయగా అసలు విషయం చెప్పారు. కొడుకు ఫోటోతో కలిసి యువరత్న సినిమా చూడటం ద్వారా అతని ఆశ తీర్చినట్టు భావించాడు మురళీధర్.
    Published by:Sumanth Kanukula
    First published: