హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇంట్లో కూతురు పుట్టినరోజు వేడుకలు.. కోడికూర వండకపోవడమే ఆ తల్లి చేసిన పాపం

ఇంట్లో కూతురు పుట్టినరోజు వేడుకలు.. కోడికూర వండకపోవడమే ఆ తల్లి చేసిన పాపం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కూతురి పుట్టిన రోజు నాడు చికెన్ కూర వండలేదని భర్తను చంపేశాడు భర్త. కొడవలితో ఆమెను నరికి చంపాడు. కర్నాటక దావణగెరెలో ఈ ఘోరం జరిగింది.

  పిల్లల బర్త్ డే ఉంటే.. ఆ ఇంట్లో సంబరాలు జరుగుతాయి. కేక్ కట్ చేస్తారు. గిఫ్ట్‌లు ఇస్తారు. చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాలను వండుకుంటారు. దాదాపు అందరి ఇళ్లలో ఇలాంటి వేడుకలు జరుగుతాయి. డబ్బున్నా లేకపోయినా.. తమకు ఉన్నంతలో పిల్లల పుట్టిన రోజును జరుపుకుంటారు. కర్నాటక (Karnataka)లోని ఓ ఇంట్లో కూడా పాప పుట్టిన రోజు జరిగింది. కూతురు కోసం చికెన్ కూర వండి పెట్టాలని భార్యకు చెప్పాడు భర్త. కానీ ఆమె పట్టించుకోలేదు.లైట్ తీసుకుంది. అంతే.. ఈ కారణం వల్ల దారుణం జరిగిపోయింది. కూతురు పుట్టిన రోజు నాడే తల్లి చనిపోయింది. కోడికూర వండలేదన్న కోపంతో...భార్యను ఆమె భర్త కొడవలితో నరికి చంపాడు.

  OMG: తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ డ్రామా... కారణం తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం.

  కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా బన్నికోడు గ్రామానికి చెందిన కెంచప్ప, షీలా (28) భార్యభర్తలు. ఎనిమిదేళ్ల కింద వివామం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ మధ్య భార్య ప్రవర్తనపై కెంచప్పకు అనుమానం పెరిగింది. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. ఇరు కుటుంబాల వారు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కెంచప్ప మారలేదు. రోజూ గొడవపడేవాడు. భర్త వేధింపులను తాళలేక షీలా కొన్నాళ్లపాటు పుట్టింటికి వెళ్లిపోయింది. కూతురు మాత్రం తండ్రివద్దే ఉంటోంది.

  ఐతే బుధవారం వీరి కూతురు పుట్టిన రోజు. కుమార్తె జన్మదిన వేడుకల సందర్భంగా పుట్టింటి నుంచి భర్త వద్దకు వచ్చింది షీలా. బర్త్ డే రోజు చికెన్ చేయాలని భార్యకు చెప్పాడు కెంచప్ప. కానీ ఆమె మాత్రం పట్టించుకోలేదు. ఇంట్లో కోడి కూర చేయలేదు. సాయంత్రం ఇంటికి వచ్చి భర్త.. కోడి కూర గురించి ప్రశ్నించాడు. చేయలేదని..ఆమె సమాధానం చెప్పింది. అంతే.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న కెంచప్ప.. భార్యతో గొడవపెట్టుకున్నాడు. ఆ తర్వాత చేయి చేసుకున్నాడు. భార్య ఎదురు తిరగడంతో తట్టుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న కొడవలిని తీసుకొచ్చి ఆమెపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో షీలా మరణించింది. భార్య మరణించిందని తెలియడంతో... కెంచప్ప ఇంటి నుంచి పారిపోయాడు. గురువారమంతా ఎవరికీ కనిపించలేదు. మద్యం మత్తు దిగిన తర్వాత.. శుక్రవారం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై హరిహర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతురు పుట్టిన రోజు నాడే.. తల్లిని తండ్రిని చంపడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Karnataka

  ఉత్తమ కథలు