హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Power Cuts: కరెంట్ ఆఫీసులో మసాలా గ్రైండింగ్.. విద్యుత్ సిబ్బంది తిక్క కుదిర్చిన రైతు

Power Cuts: కరెంట్ ఆఫీసులో మసాలా గ్రైండింగ్.. విద్యుత్ సిబ్బంది తిక్క కుదిర్చిన రైతు

కరెంట్ ఆఫీసులో మిక్సీ పడుతున్న హనుమంతప్ప

కరెంట్ ఆఫీసులో మిక్సీ పడుతున్న హనుమంతప్ప

Power Cuts: విద్యుత్ కోతల వల్ల ఇంట్లో మసాలా గ్రైండింగ్, సెల్‌ఫోన్ చార్జింగ్‌కు ఇబ్బందులు వస్తున్నాయని ఓ రైతు ఫిర్యాదు చేస్తే విద్యుత్ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కరెంట్ ఆఫీసుకు వెళ్లి.. పెట్టుకో అని ఉచిత సలహా ఇచ్చాడు. అంతే.. అప్పటి నుంచి అతడు నిజంగానే ప్రతిరోజూ కరెంట్ ఆఫీసుకు వెళ్తున్నాడు.

ఇంకా చదవండి ...

  మన దేశంలో పవర్ కట్స్ (Power Cuts) కొత్తేం కాదు. ఎండాకాలంలో విద్యుత్ కోతలు విపరీతంగా ఉంటాయి. అందులోనూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఐతే విద్యుత్ కోతలకు ఓ వ్యక్తి అద్భుతమైన పరిష్కారం కనుగోన్నాడు. అది చాలా విచిత్రమైనది. ఎందుకంటే.. ఇంట్లో పవర్ పోతే.. అతడు నేరుగా కరెంట్ ఆఫీసుకు వెళ్తాడు. అక్కడే ఫోన్‌కు చార్జింగ్ పెట్టుకుంటాడు. వంటలకు కావాల్సిన మసాలాను మిక్సీ పట్టుకుంటాడు. దాదాపు ప్రతిరోజూ అతడు కరెంట్ ఆఫీసుకు వెళ్లి.. తనకు కావాల్సిన పనులను చేసుకొని.. ఆ తర్వాతే ఇంటికి వెళ్తాడు. గత 10 నెలలుగా ఇలాగే జరుగుతోంది.

  Chicken In Coffee: కాఫీ ఆర్డర్ చేశాడు..తాగుతుంటే అందులో చికెన్ ముక్క కూడా..జొమాటో క్షమాపణ

  కర్నాటక (Karnataka) లోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఊరిలో ఎం.హనుమంతప్ప అనే రైతు ఉన్నాడు. మంగోటే గ్రామంలో అసలే కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. సమస్యను పరిష్కరించాలని.. మంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌ (MESCOM) అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి వినతీపత్రాలు సమర్పించేవాడు. చివరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఐనా పరిస్థితి మారలేదు. ఎవరూ సాయం చేయలేదు.


  స్థానిక విద్యుత్ అధికారుల తీరుతో విసిగిపోయిన హనుమంతప్ప.. ఒకరోజు మెస్కామ్ సీనియర్ అధికారికి ఫోన్ చేసి ఇదేంటని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. “ ఇంట్లో కరెంట్ లేకుంటే మసాలా ఎలా మిక్సీ పట్టుకోవాలి? ఫోన్‌లకు ఎలా చార్జింగ్ పెట్టుకోవాలి? విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరం. కరెంట్ లేదని.. ప్రతి రోజూ ఇరుగు పొరుగు ఇంటికి వెళ్లలేను.'' అని గట్టిగానే వాదించాడు. హనుమంతప్ప విజ్ఞప్తికి సదరు అధికారి వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. మెస్కామ్ ఆఫీసులో కరెంట్ ఎప్పుడూ ఉంటుంది.. అక్కడికి వెళ్లి రుబ్బుకో..అని ఉచిత సలహా ఇచ్చాడు. అంతే.. ఆ అధికారి మాటలను హనుమంతప్ప సీరియస్‌గా తీసుకున్నాడు.

  Video Viral: బీహార్‌లో లవర్స్ నైట్ సీక్రెట్‌గా కలుసుకుంటే పట్టుకొని ఏం చేశారో తెలుసా?

  ఆ మరుసటి రోజు నుంచి హనుమంతప్ప కరెంట్ ఆఫీసుకు వెళ్లేవాడు. అక్కడే మసాలాను మిక్సీ పట్టుకునేవాడు. కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లకు చార్జింగ్‌ పెట్టేవాడు. మొదట అతడిని కరెంట్ ఆఫీసు సిబ్బంది అడ్డుకున్నారు. కానీ ఉన్నతాధికారే చెప్పాడని తెలిసి.. ఆ తర్వాత ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇలా దాదాపు 10 నెలలుగా ప్రతి రోజూ కరెంట్ ఆఫీసుకు వెళ్తున్నాడు హనుమంతప్ప.


  మెస్కామ్ ఆఫీసులో హనుమంతప్ప మిక్సీ పడుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. స్థానిక మీడియా ప్రతినిధులు జూనియర్ ఇంజినీర్ విశ్వనాథ్‌ను ప్రశ్నించారు. భారీ వర్షాల కారణంగా ఐపీ సెట్‌లను మార్చడం కుదరడం లేదని.. హనుమంతప్ప ఇంటికి మల్లాపుర సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ లైన్ వేసి.. కరెంట్‌ను సరఫరా చేయవచ్చని చెప్పారు. నెలరోజుల్లో విద్కుత్ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కరెంట్ ఆఫీసులో ఉండే కింది స్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెలలుగా ఇలా జరుగుతున్నా తమకు ఎందుకు చెప్పలేదని మండిపడ్డారు. ప్రస్తుతానికైతే హనుమంతప్ప మసాలా పర్యటనలు ఆగిపోయాయి. తమ ఇంటికి కొత్త కరెంట్ కనెక్షన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాడు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: ELectricity, Karnataka, Power cuts, Trending

  ఉత్తమ కథలు