అవన్నీ మేం చూసుకుంటాం... సీఎంకు మద్యం షాపు ఓనర్ల సంఘం రిక్వెస్ట్...

మద్యం షాపుల ఓనర్లు కర్ణాటక ముఖ్యమంత్రి ముందు సరికొత్త ప్రతిపాదన పెట్టారు.

news18-telugu
Updated: April 14, 2020, 2:28 PM IST
అవన్నీ మేం చూసుకుంటాం... సీఎంకు మద్యం షాపు ఓనర్ల సంఘం రిక్వెస్ట్...
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో... మందుబాబులు ఎంతగానో ఇబ్బందిపడుతున్నారు. కొన్ని చోట్ల మందు దొరక్క పలువురు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే... మరికొన్ని చోట్ల మద్యం కొన్ని లిక్కర్ షాపుల్లో చోరీలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు మద్యం అమ్మకాలు లేకపోవడంతో లిక్కర్ షాపుల యజమానులు కూడా నష్టపోతున్నారు. తాజాగా దీనిపై కర్ణాటక సీఎం యడియూరప్పకు లిక్కర్ షాపుల యజమానుల సంఘం సభ్యులు లేఖ రాశారు. రోజుకు కనీసం రెండు గంటల పాటైనా మద్యం షాపులను తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఓ వైపు లిక్కర్ దొంగతనాలు పెరుగుతుంటే మరో వైపు మద్యం లభ్యం కాక అనేక మంది ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

నకిలీ మద్యం అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని తమ లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను నివారించేందుకు రోజులో కనీసం రెండు గంటల పాటైనా షాపులు తెరిచేందుకు అనుమతివ్వాలని సీఎంను కోరారు. రాష్ట్ర స్థాయి సంఘం అయిన ఫెడరేషన్ ఆఫ్ వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ కూడా సీఎంకు ఇదే అభ్యర్థన చేసింది. షాపు కార్యకలాపాల్లో సామాజిక దూరం నిబంధనలు అమలయ్యేలా అన్ని చర్యలూ తీసుకుంటామని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. అనేక ఉత్పత్తుల ఎక్స్‌పైరీ డేట్ సమీపిస్తోందని, తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరి... దీనిపై కర్ణాటక సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

First published: April 14, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading