మంత్రి నాగిని డాన్స్...నడిరోడ్డుపై స్టెప్పులే స్టెప్పులు...

కార్యకర్తల జోష్ చూసి ఉబ్బితబ్బిపోయిన నాగరాజు..తాను కూడా ప్రచారరథం దిగి స్టెప్పులేశారు. నాగిని పాటకు చేతులూపుతూ డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

news18-telugu
Updated: April 10, 2019, 8:36 PM IST
మంత్రి నాగిని డాన్స్...నడిరోడ్డుపై స్టెప్పులే స్టెప్పులు...
కర్నాటక మంత్రి నాగరాజు డాన్స్
news18-telugu
Updated: April 10, 2019, 8:36 PM IST
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరగనుంది. ఇక మిగిలిన చోట్ల మాత్రం ప్రచారం కొనసాగుతోంది. ఓట్ల కోసం చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తున్నారు అభ్యర్థులు. దోసెలు వేస్తూ..టీ అమ్ముతూ..హెయిర్ కట్ చేస్తూ ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్నాటకలో ఓ మంత్రి ఏకంగా నడిరోడ్డుపై స్టెప్పులేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి నాగిని డ్యాన్స్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.

కర్నాటక హౌజింగ్ మినిస్టర్ ఎంటీబీ నాగరాజు బుధవారం హోస్‌కోటెలో ప్రచారం నిర్వహించారు. ప్రచార రథంలోని స్పీకర్‌లలో నాగిని పాట వేయడంతో కార్యకర్తలంతా ఉత్సాహంగా డాన్స్ చేశారు. కార్యకర్తల జోష్ చూసి ఉబ్బితబ్బిపోయిన నాగరాజు..తాను కూడా ప్రచారరథం దిగి స్టెప్పులేశారు. నాగిని పాటకు చేతులూపుతూ డాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...