స్త్రీలను ఉద్దేశించి కర్ణాటక (Karnataka) రాష్ట్రానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి (health minister) డాక్టర్ కే సుధాకర్ (Sudhakar) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆధునిక భారతీయ మహిళలు (Indian women) ఒంటరిగా ఉండాలని కోరుకుంటారని, పెళ్లైన తర్వాత కూడా పిల్లల్ని (children) కనడానికి ఇష్టపడరని అన్నారు. అంతేకాకుండా సరోగసీ (surrogacy) ద్వారా సంతానానికి జన్మనివ్వాలని భావిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా బెంగళూరు (Bangalore)లోని జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరోలాజికల్ సైన్సెస్ (నిమ్‌హాన్స్)లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదురవుతున్నాయి.
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ఈ రోజు, నేను ఈ విషయం చెబుతున్నందుకు క్షమించండి... ఆధునిక భారత మహిళల్లో (women) చాలా మంది ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. వివాహం (marriage) చేసుకున్నప్పటికీ పిల్లలకు జన్మనివ్వడానికి ఇష్టపడటం లేదు. వారికి సరోగసీ (surrogacy) కావాలి.. కాబట్టి మన ఆలోచన విధానంలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’ అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలు మహిళలను కించపరిచేవిగా ఉన్నాయని దుయ్యబడుతున్నారు. భారతీయ సమాజంపై ‘పాశ్చాత్య ప్రభావం’ గురించి విచారం వ్యక్తం చేసిన మంత్రి సుధాకర్.. తల్లిదండ్రులను తమతో ఉండనివ్వడానికి పిల్లలు ఇష్టపడటం లేదని అన్నారు.
‘దురదృష్టవశాత్తు ఈ రోజు మనం పాశ్చాత్య మార్గంలో వెళ్తున్నాం... తల్లిదండ్రులతో కలిసి జీవించడానికి మనం ఇష్టపడటం లేదు.. తాతలు మనతో ఉండటం మర్చిపోయాం" అని మంత్రి సుధాకర్ (Sudhakar) పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు స్వల్ప, మోస్తరు లేదా తీవ్రమైన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒత్తిడి నిర్వహణ ఒక కళ.. దానిని భారతీయుడు (Indian) నేర్చుకోవలసిన అవసరం లేదు.. కానీ, దానిని ఎలా నిర్వహించాలో ప్రపంచానికి బోధించాలి అని మంత్రి అన్నారు.
#WATCH | ...Today we don't want our parents to live with us. A lot of modern women in India want to stay single. Even if they get married, don't want to give birth. Paradigm shift in our thinking,it's not good: Karnataka Health Min on World Mental Health Day,at NIMHANS, Bengaluru pic.twitter.com/LkX7Ab7Sks
— ANI (@ANI) October 10, 2021
ఎందుకంటే యోగా, ధ్యానం, ప్రాణాయామం మన పూర్వీకులు మనకు ఇచ్చిన గొప్ప ఆయుధాలు.. వేలాది ఏళ్ల కిందటే ప్రపంచానికి బోధించారు.’ కోవిడ్-19 (covid 19) మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తాకడానికే కాదు, కనీసం దగ్గరకు కూడా బంధువులు చేరడం లేదని, ఇది ఓ మానసిక సమస్య అని ఆయన అన్నారు.
అయితే మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సోమవారం ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యలను, మన భారతీయ కుటుంబ విలువ వ్యవస్థ ఎలా పరిష్కరిస్తుందనే సందేశాన్ని పంపాలని నేను అనుకున్నా. అందువల్ల నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న పెద్ద పాయింట్‌ని చెప్పలేకపోయా. ముందుగా నేను ఒక కుమార్తెకు గర్వపడే తండ్రిని, నేను కూడా ఒక వైద్యుడిని అని తెలియజేయాలనుకుంటున్నా. కాబట్టి మహిళల సమస్యలను కూడా నేను పూర్తిగా అర్థం చేసుకోగలను" అని సుధాకర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health minister, Karnataka, Women