Karnataka Floor Test | బలపరీక్షపై కుమారస్వామికి గవర్నర్ రెండో డెడ్‌లైన్

Karnataka Trust Vote | ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వాజుభాయ్ వాలా.. సీఎం కుమారస్వామిని ఆదేశించారు.

news18-telugu
Updated: July 19, 2019, 4:16 PM IST
Karnataka Floor Test | బలపరీక్షపై కుమారస్వామికి గవర్నర్ రెండో డెడ్‌లైన్
సీఎం కుమారస్వామి(File)
  • Share this:
కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామికి గవర్నర్ వాజుభాయ్ వాలా మరోసారి డెడ్‌లైన్ పొడిగించారు. ఇప్పటికే శుక్రవారం మధ్యాహ్నం 1.30లోపు ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవాలంటూ నిన్న లేఖ రాశారు. అయితే, ఆ గడువు ముగిసిపోయింది. ఇంకా ఎమ్మెల్యేలు మాట్లాడాల్సి ఉన్నందున అది పూర్తయ్యే వరకు ఓటింగ్ నిర్వహించబోనని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో గవర్నర్ వాజుభాయ్ వాలా.. మరోసారి కుమారస్వామికి డెడ్‌లైన్ పొడిగించారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలలోపు ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవాలని సూచించారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు గుండురావ్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తమ పార్టీ హక్కును కాలరాసేలా ఉన్నాయని ఆరోపించారు. పార్టీ ఆదేశాలను పాటించేలా విప్ జారీచేసే హక్కును సుప్రీం ఆదేశాలు కాలరాస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ రెబల్ ఎమ్మెల్యేలు బలపరీక్షలో కచ్చితంగా పాల్గొనాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు పార్టీ విప్ జారీ చేసే హక్కుని ఉల్లంఘిస్తున్నాయని గుండురావ్ అన్నారు.

మరోవైపు గవర్నర్ లేఖపై కుమారస్వామి సెటైర్లు వేశారు. గవర్నర్ లవ్ లెటర్ రాశారంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నట్టు తనకు సమాచారం ఉందని, వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ రాశారని కుమారస్వామి చెప్పారు. అయితే, ఎవరు ఎమ్మెల్యేలను కొంటున్నారో, ఎవరు ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు. తాను పదవి కోసం పాకులాడడం లేదని, ఒకవేళ తాను ఆ ఉద్దేశంతో ఉంటే.. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిన వెంటనే విదేశాల నుంచి వచ్చేసేవాడినన్నారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>